నాని 'ప్యారడైజ్‌'కి ఆ టైం ఉండదా?

నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న 'ది ప్యారడైజ్‌' మూవీని మొదట ఆగస్టు నెలలో విడుదల చేయాలని భావించారు.

Update: 2026-08-25 00:30 GMT

నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న 'ది ప్యారడైజ్‌' మూవీని మొదట ఆగస్టు నెలలో విడుదల చేయాలని భావించారు. కానీ షూటింగ్‌ ఆలస్యం కావడంతో విడుదల వాయిదా వేశారు. ప్యారడైజ్‌ ఆలస్యం కావడంతో రవితేజ 'ఇరుముడి' సినిమాకు కలిసి వచ్చింది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ఇరుముడి బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు నమోదు చేసింది. మొదటి వీకెండ్‌ పూర్తి అయ్యేప్పటికి దాదాపు వంద కోట్ల వసూళ్లకు చేరువ అయింది. అతి తక్కువ సమయంలోనే యూఎస్‌లో మిలియన్‌ డాలర్ల వసూళ్లు నమోదు చేసింది. అంతకు ముందు వారం విడుదలైన సూర్య విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. లక్కీ ఆగస్టు ను నాని ప్యారడైజ్ మిస్‌ చేసుకుంది అంటూ చాలా మంది అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నాని మూవీ...

దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల సినిమాను రాజమౌళి కంటే ఎక్కువగా చెక్కుతున్నట్లు అనిపిస్తుందని, ఇకపై అయినా సినిమాను పూర్తి చేసి విడుదలకు రెడీ చేయాలని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా షూటింగ్‌ ఇంకా బ్యాలన్స్ ఉంది. సినిమా విడుదలకు సరిగ్గా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. షూటింగ్‌ ఇంకా రెండు వారాలు పట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాకు అనిరుథ్‌ సంగీతాన్ని అందించాల్సి ఉంది. షూటింగ్‌ పూర్తి చేసి ఇస్తే తప్ప రీ రికార్డింగ్‌ పూర్తి చేసి ఇవ్వలేని పరిస్థితి. అనిరుథ్‌ చాలా బిజీ మ్యూజిషియన్‌ అనే విషయం తెల్సిందే. ఆయనకు డెడ్‌ లైన్ పెట్టకుండా , సినిమాను విడుదల తేదీకి కనీసం నెల ముందు అయినా ఇవ్వాలనే టాక్‌ ఉంది. కానీ వారం రెండు వారాల సమయం ఇచ్చి హడావిడిగా ఇవ్వాలంటే అనిరుథ్‌ ఎలా రియాక్ట్‌ అవుతాడో అనేది చూడాలి.

నాని ది ప్యారడైజ్‌ మూవీ రిలీజ్‌ డేట్...

అనిరుథ్‌ ను కన్విన్స్ చేసి ఏదోలా వర్క్ చేయించుకున్నా ది ప్యారడైజ్‌ మూవీ యూనిట్‌ కి ప్రమోషన్‌ చేసేందుకు సరైన సమయం ఉండక పోవచ్చు అనేది ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం. సినిమా విడుదలకు వారం ఉండగ కూడా ఏదో ఒక వర్క్‌తో హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల, హీరోయిన్‌ కయాదు బిజీగా ఉంటే ప్రమోషన్‌లో కనిపించేది ఎవరు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్య కాలంలో విడుదలై మంచి విజయాలను సొంతం చేసుకున్న సినిమాలను చూస్తే ఎక్కువ శాతం రెండు మూడు వారాలు, అంతకు మించి ప్రమోషన్‌ చేసిన సినిమాలు ఉన్నాయి. అంతెందుకు ఇటీవల విడుదలైన ఇరుముడి సినిమాను రవితేజ, శివ నిర్వాన రెండు మూడు వారాలు ముందు ఉండి మరీ ప్రమోషన్‌ చేశారు. రవితేజ ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. శివ నిర్వాన చాలా ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు, ప్రెస్‌మీట్స్‌ లో కనిపించాడు.

నాని, శ్రీకాంత్‌ ఓదెల మూవీ..

అంతకు ముందు వచ్చిన సినిమాల విషయంలోనూ ప్రమోషన్‌ కీలక పాత్ర పోషించింది. అందుకే కంటెంట్‌ కంటే ప్రధానంగా ప్రమోషన్‌కి టైంను చూసుకుంటున్నారు. ప్రమోషన్స్‌ కు సమయం లేని కారణంగా వాయిదా పడ్డ సినిమాలు ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు. పరిస్థితులు ఇలా ఉంటే ది ప్యారడైజ్‌ సినిమాను మాత్రం పెద్దగా ప్రమోషన్‌ లేకుండానే వచ్చే నెల 24న విడుదల చేయాలని మేకర్స్ హడావిడి చేస్తున్నారు. ది ప్యారడైజ్‌ మూవీకి ఉన్న బజ్‌ నేపథ్యంలో నైజాం ఏరియాలో భారీ బిజినెస్ చేసింది. ఇతర ఏరియాల్లోనూ నాని కెరీర్‌లో బెస్ట్‌ నెంబర్స్‌ నమోదు అయ్యాయి అంటున్నారు. నైజాం ఏరియాలో నెవ్వర్‌ బిఫోర్‌ నెంబర్స్‌ను నాని చూస్తాడనే అభిప్రాయం ఉంది.

ఇప్పటికే ఆలస్యం అయిన సినిమాను మరోసారి వాయిదా వేసే పరిస్థితి లేదు. కనుక శ్రీకాంత్‌ ఓదెల కాస్త ప్రమోషన్‌ విషయంలోనూ దృష్టి పెట్టాలని, నాని కాస్త బయటకు వచ్చి సినిమా గురించి జనాల్లో తెలిసేలా మాట్లాడాలంటూ ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక వైపు షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ చేస్తూనే ప్రమోషన్‌ వర్క్‌ సైతం చేయాల్సిన అవసరం ఉంది. మరి నాని, శ్రీకాంత్‌ ఈ విషయాన్ని ఎలా బ్యాలన్స్ చేస్తారో చూడాలి. సెప్టెంబర్‌ 24న విడుదల కాబోతున్న ది ప్యారడైజ్ మూవీకి పెద్దగా పోటీ లేకపోవడం వల్ల సాలిడ్‌ ఓపెనింగ్స్ నమోదు కావడం ఖాయం అని విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News