ప్యారడైజ్ లేట్ కు కారణమేంటి? బ్యాక్ గ్రౌండ్ లో ఏం జరుగుతోంది?
నేచురల్ స్టార్ నాని లీడ్ రోల్ లో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ది ప్యారడైజ్ పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి.
నేచురల్ స్టార్ నాని లీడ్ రోల్ లో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ది ప్యారడైజ్ పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. దసరా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆ కాంబినేషన్ రిపీట్ కావడంతో అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఆ సినిమా విడుదల, షూటింగ్ షెడ్యూల్స్ కు సంబంధించి పలు చర్చలు జరుగుతున్నాయి.
వాస్తవానికి ఆ చిత్రాన్ని ఆగస్టు 21న విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించారు. కానీ ప్రస్తుతం షూటింగ్ పనులు ఇంకా పూర్తికాలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని కీలక యాక్షన్ సీన్స్, టాకీ పార్ట్ ఇంకా మిగిలి ఉన్నాయని టాక్. దీంతో అనుకున్న సమయానికి చిత్రీకరణ కంప్లీట్ అవుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా నాని సినిమాలు వేగంగా పూర్తవుతుంటాయి. కానీ ది ప్యారడైజ్ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది.
సినిమా ప్రారంభమైన తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సహా టీమ్ పూర్తిగా ప్రాజెక్టుపైనే దృష్టి పెట్టింది. అయినప్పటికీ షూటింగ్ ఊహించిన దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం సినిమా స్కేల్ అని తెలుస్తోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఆ మూవీలో అనేక భారీ సన్నివేశాలు ఉండటంతో షూటింగ్ కొన్నినెలలుగా కొనసాగుతోందని సమాచారం.
దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని అత్యంత క్వాలిటీతో తెరకెక్కించాలనే లక్ష్యంతో పని చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో అనేక సన్నివేశాలకు ఎక్స్ ట్రా రోజులు కేటాయించాల్సి వస్తోందట. మరోవైపు షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్యారలల్ గా కొనసాగుతున్నాయి. భారీ విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్న నేపథ్యంలో ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్ పనులు కూడా ఎక్కువ సమయం తీసుకుంటున్నాయని వినికిడి.
అందుకే విడుదల తేదీ విషయంలో మూవీ టీమ్ జాగ్రత్తగా వ్యవహరిస్తోందని సమాచారం. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కూడా ఆ ఆలస్యానికి ఒక కారణంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సౌత్ లో అత్యంత బిజీగా ఉన్న సంగీత దర్శకుల్లో అనిరుధ్ ఒకరు. ప్యారడైజ్ కు బెస్ట్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాలనే టార్గెట్ తో మూవీ యూనిట్ పనిచేస్తోందట. అందుకు అవసరమైన సమయం కూడా ఎక్కువగానే పడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఆగస్టు విడుదల కంటే సెప్టెంబర్ చివరి వారంలో సినిమాను విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే దీనిపై మూవీ టీమ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉంటే.. షూటింగ్ ఇంతకాలం కొనసాగుతుండటంతో మరో ఆసక్తికరమైన చర్చ కూడా ఇప్పుడు జరుగుతోంది. స్టోరీ రేంజ్ పెద్దదిగా ఉండటంతో ది ప్యారడైజ్ ను ప్యూచర్ లో రెండు భాగాలుగా తీసుకురావచ్చా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే దీనికి సంబంధించి ఎలాంటి అఫిషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. ఏదేమైనా ది ప్యారడైజ్ ఆలస్యానికి ప్రధాన కారణాలు లాంగ్ షూటింగ్ షెడ్యూల్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, మ్యూజిక్ విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలేనని తెలుస్తోంది. అయితే అసలు విషయంపై క్లారిటీ కావాలంటే మూవీ యూనిట్ రెస్పాండ్ అయితే గానీ తెలియదు.