శ్రీకాంత్ ఓదెల.. మంచి మొండోడు..
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అంటేనే ఓ పట్టుదల.. ఓ రకమైన మొండితనం. తాను అనుకున్నది సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకురావాలంటే ఎంత కష్టమైనా తగ్గని క్యారెక్టర్.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అంటేనే ఓ పట్టుదల.. ఓ రకమైన మొండితనం. తాను అనుకున్నది సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకురావాలంటే ఎంత కష్టమైనా తగ్గని క్యారెక్టర్. దసరాతో తన సత్తా చూపించిన శ్రీకాంత్.. ఇప్పుడు ది ప్యారడైజ్ తో తన బిగ్ డ్రీమ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే శ్రీకాంత్ లోని ఆ మొండితనం గురించి ఆయనతో కలిసి పనిచేసిన నేచురల్ స్టార్ నాని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.
ది ప్యారడైజ్ ప్రెస్ మీట్ లో నాని మాట్లాడుతూ.. శ్రీకాంత్ ఓదెల మొండోడు కానీ, అది మంచి మొండితనం అని అన్నారు. ప్యారడైజ్ లాంటి సినిమాను తీయాలంటే 100 శాతం మొండోడు అయ్యి ఉండాలని చెప్పారు. ఎందుకంటే ఇలాంటి సినిమాను ఊహించాలన్నా, దాన్ని ప్లాన్ చేయాలన్నా అంతటి పట్టుదల అవసరమన్నారు. గోదావరిఖని నుంచి వచ్చిన ఓ కుర్రాడు ఇంత పెద్ద కల కనాలంటే, ఇంత పెద్ద విజన్ తో సినిమా చేయాలంటే ఆ మొండితనం ఉండాల్సిందేనని నాని చెప్పడం ఫుల్ వైరల్ అవుతోంది.
అయితే ఆ మొండితనం కేవలం మాటల్లోనే కాదు.. శ్రీకాంత్ వర్క్ చేసే ప్రాసెస్ లో కూడా కనిపిస్తుందట. రియలిస్టిక్ గా, నేచురల్ గా సినిమా కనిపించాలనే విషయంలో ఆయన రాజీపడరని తెలుస్తోంది. దసరాలో గోదావరిఖని నేటివిటీ, అక్కడి మనుషుల లైఫ్ స్టైల్ ను చూపించిన శ్రీకాంత్.. ఇప్పుడు ది ప్యారడైజ్ లో కూడా తన విజన్ ను మరింత బిగ్ రేంజ్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన శ్రీకాంత్ ఓదెల.. అక్కడ నేర్చుకున్న డిసిప్లైన్ తన సినిమాల్లో కూడా కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది. స్టోరీ, సీన్స్, రోల్స్, ఎమోషన్స్ విషయంలో ముందుగానే చాలా వర్క్ చేయడం ఆయన స్టైల్ గా మారింది. షూటింగ్ మొదలైన తర్వాత కూడా తాను అనుకున్న అవుట్ పుట్ వచ్చే వరకు వదిలిపెట్టరనే పేరుంది. ఇదే విషయాన్ని నాని మరో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ తో గుర్తు చేసుకున్నారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక రోజు షూటింగ్ జరుగుతున్నప్పుడు శ్రీకాంత్ తన దగ్గరకు వచ్చి టైమ్ మేనేజ్మెంట్ మిస్ అయ్యానని, అది నేర్చుకోవాలని ఉందని చెప్పాడట. రాజమౌళి పరిచయం ఉండటంతో ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ చేయమని అడిగాడని నాని తెలిపారు. తనకు ఆ మాట చాలా నచ్చిందని చెప్పారు. అందరిలోనూ ప్యాషన్ ఉంటుందని.. కానీ ఏదో ఒకటి నేర్చుకోవాలనే ఆలోచన ఉండటం ముఖ్యమని, శ్రీకాంత్ అలా రియలైజ్ కావడం తనకు నచ్చిందన్నారు.
ఇక్కడే శ్రీకాంత్ మొండితనానికి అసలు అర్థం కనిపిస్తోంది. కేవలం తన మాటే నెగ్గాలనే మొండితనం కాదు.. కావాల్సిన రేంజ్ లో అవుట్ పుట్ రావాలనే పట్టుదల. అవసరమైతే తనలోని మిస్టేక్ గుర్తించి నేర్చుకోవాలనే క్యారెక్టర్. ఇక ఇప్పుడు ప్యారడైజ్ తో మరో భారీ హిట్ అందుకోవాలని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 24న ఆ మూవీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.