ఇదేం స్పీడ్ నాని?.. ఆ డైరెక్టర్ తోనే మళ్లీ..
ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ తో తామిద్దరం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చెప్పారు. రీసెంట్ గా శైలేష్ స్టోరీ లైన్ చెప్పినట్లు వెల్లడించారు.;
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని స్పీడ్ ఇప్పుడు మామూలుగా లేదని చెప్పాలి. వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నారు. ఓ మూవీ సెట్స్ పై ఉండగానే.. మరొకటి లైనప్ లోకి యాడ్ చేస్తున్నారు. నాన్ స్టాప్ షూటింగ్స్ లో పాల్గొంటూ బిజీగా గడుపుతున్నారు. అదే సమయంలో వరుస హిట్స్ అందుకుంటున్నారు.
దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్న నాని.. రీసెంట్ గా హిట్ -3 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నెవ్వర్ బిఫోర్ అవతార్ లో కనిపించిన ఆయన.. తన యాక్టింగ్ తో అందరినీ మెప్పించారు. వరుసగా నాలుగో హిట్ ను తన ఖాతాలో వేసుకుని సత్తా చాటారు నేచురల్ స్టార్.
కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నాని.. ఆ తర్వాత శ్రీకాంత్ తెరకెక్కించనున్న ప్యారడైజ్ మూవీని పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత సుజీత్ సినిమాను స్టార్ట్ చేయనున్నారు. అలా వరుసగా వివిధ సినిమాలను లైన్ లో పెట్టేశారు నాని. అయితే ఆయన.. హిట్-3 డైరెక్టర్ శైలేష్ కొలనుతో మరో మూవీ చేయనున్నారు.
రీసెంట్ గా హిట్ 3 సక్సెస్ మీట్ జరగ్గా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కచ్చితంగా శైలేష్ తో మరో సినిమా ఉంటుందని తెలిపారు. కానీ ఈ సారి హిట్ 3 లాంటి మూవీ కాదని క్లారిటీ ఇచ్చారు. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ తో తామిద్దరం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చెప్పారు. రీసెంట్ గా శైలేష్ స్టోరీ లైన్ చెప్పినట్లు వెల్లడించారు.
అయితే ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇంకా తెలియదని అన్నారు. కానీ సినిమా మాత్రం బాగుంటుందని అప్పుడే చెప్పేశారు. దీంతో నాని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో హిట్ 3 కాంబినేషన్ లో నాన్ వైలెన్స్ మూవీ లోడింగ్ అంటూ అనేక మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇక దసరా సినిమాకు గాను తనలో మాస్ ను బయటపెట్టిన నాని.. ఇప్పుడు హిట్-3 సినిమాలో అటు మాస్.. ఇటు వైలెన్స్ రెండూ చూపించారు. అప్ కమింగ్ ప్యారడైజ్ లో అయితే నాని కొత్త అవతార్ లో కనిపించనున్నట్టు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అయితే తాను అన్ని జోనర్స్ సినిమాలు చేస్తానని కొద్ది రోజుల క్రితం చెప్పారు. అందుకు తగ్గట్లే ఇప్పుడు శైలేష్ కొలను కామెడీ ఎంటర్టైనర్ చేయనున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది.