• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కన్నడ లోకల్ స్టార్స్ తో...

కన్నడ లోకల్ స్టార్స్ తో నాని.. ఇది మంచి ప్లానే..

| నేచురల్ స్టార్ నాని ఒక సినిమా చేశాడు అంటే అది మొదలైనప్పటి నుంచి థియేటర్లోకి వచ్చే వరకు కూడా అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు.

By - Tupaki Desk
Update: 2024-08-28 09:03 GMT

నేచురల్ స్టార్ నాని ఒక సినిమా చేశాడు అంటే అది మొదలైనప్పటి నుంచి థియేటర్లోకి వచ్చే వరకు కూడా అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. ముఖ్యంగా ప్రమోషన్స్ విషయంలో అత్యంత బాధ్యతతో నడుచుకునే యువ హీరోలలో నాని టాప్ లిస్టులో ఉన్నాడు అని చెప్పవచ్చు. ఒక సినిమాను జనాల్లోకి ఎలా తీసుకువెళ్లాలో నానికి చాలా బాగా తెలుసు. ఇక ఈసారి సరిపోదా శనివారం సినిమా కోసం అతను ఇంకా ఎక్కువగానే కష్టపడుతున్నాడు అని అర్థమవుతుంది.

సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కొనసాగుతున్న సమయంలోనే నాని ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు. ఇక కొన్నిసార్లు హీరోయిన్ మిగతా ఆర్టిస్టులు కూడా అతనితో ఉన్నప్పటికీ నాని ఎక్కువ స్థాయిలోనే సినిమాను ప్రమోట్ చేస్తూ కనిపిస్తున్నాడు. ఎవరు ఉన్నా లేకపోయినా కూడా అతను ప్రతి చోట సినిమాను జనాల్లోకి తీసుకు వెళుతూ ఉన్నాడు. సరిపోదా శనివారం కేవలం తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా గ్రాండ్ గా విడుదల అవుతుంది.

ఇక హిందీలో అవసరమైన మేరకు ప్రమోషన్స్ చేసిన నాని ఆ తర్వాత తమిళంలో నటుడు సూర్యతో కలిసి బాగానే ప్రమోట్ చేశాడు. కన్నడ ఇండస్ట్రీలో కూడా అతను తీసుకున్న జాగ్రత్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాని ఒక్కడే కర్ణాటక వెళ్లి అక్కడ లోకల్ స్టార్స్ టెజో సినిమాకు ఉపయోగపడే విధంగా ప్రమోషన్స్ చేస్తూ ఉన్నాడు.

కన్నడ గడ్డపై అడుగుపెట్టగానే అక్కడ స్టార్ హీరో సుజిత్ ను కలిశాడు. ఈగ సినిమాలో కలిసి వర్క్ చేశారు కాబట్టి ఆ సాన్నిహిత్యం మొదటి నుంచి ఉంది. ఇక శివరాజ్ కుమార్ తో కూడా ప్రత్యేకంగా చేసిన ప్రమోషన్ వైరల్ అయింది. శివరాజ్ కుమార్ నటించిన భైరతి రణగల్ సినిమా నవంబర్లో విడుదల కాబోతోంది. ఆ సినిమాతో కలిపి నాని తన సినిమాను ప్రమోట్ చేశాడు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.

అక్కడ జనాలకు కనెక్ట్ అయ్యే విధంగా లోకల్ స్టార్స్ ను కలుపుకున్న విధానం చూస్తూ ఉంటే నాని సినిమా కోసం ఎంతలా ఆలోచిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. కన్నడ గడ్డపై మన హీరోలకు మంచి మార్కెట్ ఉంది. నాని గత సినిమాలకు కూడా అక్కడ మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఇక టాలీవుడ్ లో ఒక మాస్ సినిమా వస్తోంది అంటే తప్పకుండా కన్నడంలో మంచి క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు సరిపోదా శనివారంకు కూడా అదే రెస్పాన్స్ వస్తుంది అని నాని అక్కడ ప్రేక్షకులను ఎక్కువగా ఎట్రాక్ట్ చేయాలని చూస్తున్నాడు. మరి ఈ తరహా ప్రణాళికలు సినిమాకు ఎంతవరకు హెల్ప్ అవుతాయో చూడాలి.

Tags:    
  • Naturalstarnani 
  • Nani 
  • Saripodasanivaaram 
  • Kicchasudeep 
  • Shivarajkumar 
  • Bhairathiranagal 
  • Vivekathreya 
  • Tollywood 
  • Nanikannadaheroes 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS