నాని.. ఫ్యాన్స్ కు స్వీట్ గా ఇలా..

అదే సమయంలో కెరీర్ లో ఎక్కువగా క్లాస్ జోనర్ లో సినిమాలు చేశారు నాని. క్లాస్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ గా కూడా నిలిచారు.;

Update: 2025-04-14 14:02 GMT

టాలీవుడ్ నేచురల్ స్టార్ నానికి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తన కెరీర్ ను తానే మార్చుకుంటూ, మలుచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఒకానొక టైమ్ లో నాని సినిమాలు ఫ్లాపులుగా నిలిస్తే.. ఆయన టైమ్ అయిపోయిందని కామెంట్స్ వినిపించాయి. కానీ వాటికి దీటుగా ఆన్సర్ ఇస్తూ మళ్లీ కెరీర్ లో పైకి లేచారు.

ఇప్పుడు వరుస హిట్స్.. సినిమాలతో దూసుకెళ్తున్నారు. అటు హీరోగా.. ఇటు నిర్మాతగా సక్సెస్ లు అందుకుని సందడి చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న నాని కెరీర్ లో చేసిన ప్రతి సినిమా స్పెషలే. రొటీన్ కాకుండా.. కచ్చితంగా డిఫరెంట్ గా ట్రై చేసిన చిత్రాలే అన్నీ. అలా తన కంటూ స్పెషల్ క్రేజ్ దక్కించుకున్నారు.

అదే సమయంలో కెరీర్ లో ఎక్కువగా క్లాస్ జోనర్ లో సినిమాలు చేశారు నాని. క్లాస్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ గా కూడా నిలిచారు. చెప్పాలంటే ఆయన ఫ్యాన్స్ ఎక్కువ మంది నాని క్లాస్ సినిమాలే నచ్చుతారు. అంతలా అంతా కనెక్ట్ అయిపోయారు. కానీ కొంతకాలం నుంచి నాని తన రూట్ ను మెల్లగా మార్చుతున్నారు.. మార్చేశారు కూడా!

దసరా మూవీతో ఒక్కసారి మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. తనలో మరో టాలెంట్ ను చూపించి ఫిదా చేశారు. అంతకుముందు ఎంసీఏ, నేను లోకల్ చిత్రాలతో మాస్ సినీ ప్రియులను మెప్పించినా.. దసరాతో ఫ్లాట్ చేశారు. అలా అని తన పాత జోనర్ ను వదలకుండా.. హాయ్ నాన్న, సరిపోదా శనివారంతో ఆకర్షించారు.

అటు మాస్.. ఇటు క్లాస్ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు నాని. ప్రస్తుతం ది ప్యారడైజ్ తో పాటు హిట్-3 సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ప్యారడైజ్.. మంచి మాస్ మసాలా కంటెంట్ ఉన్న మూవీగా తెలుస్తోంది. ఇక హిట్-3 అయితే మాస్ కాదు.. ఏకంగా వయొలెంట్ మూవీ. ఇప్పటికే ఆ విషయంలో అందరికీ క్లారిటీ వచ్చేసింది.

మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ తర్వాత.. వేరే లెవెల్ వయొలెన్స్ అని అంతా కామెంట్లు పెడుతున్నారు. అయితే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో క్రేజీ అండ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు నాని. మే1వ తేదీన రిలీజ్ కానున్న హిట్-3 మూవీ విషయంలో క్లాస్ ఫ్యాన్స్ కాస్త జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

"హీరో నాని యాక్షన్ మూవీస్ చేయాలని కోరుకునేవారు.. మే1న థియేటర్స్ కు రండి.. అదే నాని లవ్ స్టోరీలు, ఫీల్ గుడ్, ఫన్ మూవీస్ చేయాలని అనుకునేవారు.. కాస్త జాగ్రత్తగా ఉండండి.. నేచురల్ స్టార్ అన్ని జోనర్స్ లో నటించాలని అనుకునేవారు మూవీని ఎంజాయ్ చేయండి" అని నాని నవ్వుతూ ఈవెంట్ లో మాట్లాడారు.

Tags:    

Similar News