నేచుర‌ల్ స్టార్ నాని డెడికేష‌న్‌కు అంతా ఫిదా అవ్వాల్సిందే

నేచుర‌ల్ స్టార్ నాని అటు నిర్మాత‌గా, ఇటు హీరోగా వ‌రుస విజ‌యాల్ని సొంతం చేసుకుంటూ వార్త‌ల్లో నిలుస్తున్నారు.;

Update: 2025-04-22 10:55 GMT

నేచుర‌ల్ స్టార్ నాని అటు నిర్మాత‌గా, ఇటు హీరోగా వ‌రుస విజ‌యాల్ని సొంతం చేసుకుంటూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. `ద‌స‌రా` నుంచి త‌న స్ట్రాట‌జీని మార్చుకున్న నాని అదే పంథాలో వ‌రుస స‌క్సెస్‌లు సాధిస్తూ హీరోగా దూసుకుపోతున్నారు. ఇదే ఊపులో ఆయ‌న న‌టించిన లేటెస్ట్ మూవీ `హిట్ 3` మే 1న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ మూవీ ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది.


దీనికి ఏమాత్రం తీసిపోని స్థాయి నేచుర‌ల్ స్టార్ నాని `హిట్ 3` ప్ర‌మోష‌న్స్‌ని జోరుగా చేస్తూ త‌న చ‌క్క‌ని ప్లానింగ్‌తో అంద‌రిని ఫిదా చేస్తున్నారు. హీరోగా న‌టించ‌డంతో పాటు ఈ మూవీకి తానే నిర్మాత కావ‌డంతో రెండు బాధ్య‌త‌ల్ని స‌మ్థ‌వంతంగా పోషిస్తున్న నాని ప్ర‌మోష‌న్స్ విష‌యంలో జోరు పెంచారు. సినిమా రిలీజ్‌కు మ‌రో వారం రోజులు మాత్ర‌మే ఉండ‌టంతో పాన్ ఇండియా వైడ్‌గా ప్ర‌మోష‌న్స్ చేస్తూ నాని హ‌ల్ చేస్తున్నారు.

సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం త‌న‌తో పాటు హీరోయిన్ శ్రీ‌నిధిశెట్టిని కూడా రంగంలోకి దించేసిన నాని దేశంలోని మేజ‌ర్ సిటీస్‌లో ప‌ర్య‌టిస్తూ ప్ర‌మోష‌న్స్ ని హీటెక్కిస్తున్నారు. యుఎస్‌లోనూ నానితో క‌లిసి శ్రీ‌నిధిశెట్టి ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన‌బోతున్నారు. ఇందు కోసం ఏప్రిల్ 30న యుఎస్‌కు వెళ్ల‌బోతున్నారు. మే 6 వ‌ర‌కు అక్క‌డే ప్ర‌మోష‌న్స్ చేయ‌బోతున్నారు.

డ‌ల్లాస్‌, ఆస్టిల్‌, సేటిల్‌, లాస్ ఏంజిల్స్‌, కాన్సాస్‌ల‌లో ప‌ర్య‌టించి అక్క‌డి అభిమానుల‌తో ఇంట‌రాక్ట్ కానున్నారు. `కోర్ట్‌` తో పాటు త‌న ప్రీవియ‌స్ సినిమాల ప్రమోష‌న్స్ కోసం కూడా ఇదే స్థాయిలో ప్ర‌మోట్ చేసిన నాని `హిట్ 3` కోసం కూడా త‌న‌దైన డెడికేష‌న్‌తో ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొంటుండ‌టం అంద‌రిని ఫిదా చేస్తోంది. సినిమా అంద‌రికి చేరాల‌నే ల‌క్ష్యంతో నాని చేస్తున్న ప‌బ్లిసిటీకి అంతా ఫిదా అవుతున్నారు. నాని, శ్రీ‌నిధిశెట్టి యుఎస్ టూర్ షెడ్యూల్‌కి సంబంధించిన పోస్ట‌ర్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. నానికి సినిమాపై ఉన్న డెడికేష‌న్‌కు అంతా ముచ్చ‌ట‌ప‌డుతున్నారు.

Tags:    

Similar News