• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నేచురల్ స్టార్ నాని.. మరో...

నేచురల్ స్టార్ నాని.. మరో క్రేజీ కాంబో..

| 'టక్ జగదీష్' తర్వాత వీరు మళ్లీ కలిసి పనిచేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు మలయాళ దర్శకుడు విపిన్ దాస్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం.

By - Tupaki Desk
Update: 2024-11-15 11:30 GMT

నేచురల్ స్టార్ నాని వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలు చేయడమే కాకుండా తన మార్కెట్ స్థాయిని కూడా పెంచుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం నాని శైలేష్ కొలను దర్శకత్వంలో 'హిట్ 3' షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమా 2025 వేసవిలో విడుదల కానుంది. ఇటీవల శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్‌ను లాంచ్ చేసిన నాని, ఆ చిత్రం షూటింగ్‌ను వచ్చే ఏడాది ప్రారంభించనున్నారు.

ఇవి కాకుండా నాని, సుజీత్ కాంబినేషన్‌లో మరో యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందబోతోంది. ఆ సినిమా పవన్ కళ్యాణ్ OG అనంతరం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇలా పలు డిఫరెంట్ సినిమాలతో బిజీగా ఉన్న నాని, మరిన్ని కొత్త కథల కోసం చర్చలు జరుపుతున్నారు. తాజాగా నాని, షైన్ స్క్రీన్స్ నిర్మాణ సంస్థ సాహు గారపాటి, హరీష్ పెద్ది కలయికలో మరో ప్రాజెక్ట్ ప్లాన్ అవుతున్నట్టు సమాచారం.

'టక్ జగదీష్' తర్వాత వీరు మళ్లీ కలిసి పనిచేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు మలయాళ దర్శకుడు విపిన్ దాస్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. విపిన్ దాస్ మంచి కంటెంట్ ఉన్న దర్శకుడు. ఇప్పటికే 'జయ జయ జయ జయ హే', 'గురువాయూర్ అంబలనడయిల్' వంటి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

తాజాగా ఆయన చెప్పిన కథ నానికి బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌కు ఆయన సంతోషంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడనుంది. విపిన్ దాస్ దర్శకత్వంలో నాని నటించబోయే ఈ చిత్రం 2026లో సెట్స్‌పైకి వెళ్లనుందట. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్స్ పూర్తి అయిన తర్వాత ఈ సినిమా మొదలుకానుంది. విభిన్నమైన కథాంశాలతో విపిన్ దాస్ తెరకెక్కించబోయే ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం వ్యక్తమవుతోంది.

ఇప్పటికే వరుస విజయాలతో జోరు మీదున్న నాని, కొత్త తరహా కథలపై దృష్టి సారిస్తున్నారు. ప్రతి సినిమాలో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకుల మనసు దోచుకుంటున్న నాని, విపిన్ దాస్‌తో కలయికలో కూడా ఇదే స్థాయిలో కొత్తదనాన్ని అందిస్తుందని టాక్. అసలే మలయాళం దర్శకులు తక్కువ బడ్జెట్ లో బెస్ట్ అవుట్ పుట్ ఇస్తారని అంటారు. ఇక నానితో సినిమా అంటే ఇప్పుడు బడ్జెట్ 50 కోట్లు దాటుతోంది. కాబట్టి ఆ దర్శకుడికి ఫ్రీ హ్యాండ్ లభించినట్లే. మరి అలాంటి దర్శకుడితో నాని ఎలాంటి కంటెంట్ ను రప్పిస్తాడో చూడాలి.

Tags:    
  • Naturalstar 
  • Nani 
  • Malayalamdirector 
  • Vipindas 
  • TuckJagadish 
  • Tollywood 
  • FilmIndustry 

Similar News

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS