నాని బాక్సాఫీస్.. ఇప్పటికే 400 కోట్లు ఉందంటే..

జడల్ అనే పాత్రలో నాని నెవ్వర్ బిఫోర్ లుక్‌లో కనబడబోతుండటంతో ఫ్యాన్స్‌లో భారీ హైప్ క్రియేట్ అయింది.;

Update: 2025-08-19 01:30 GMT

టాలీవుడ్‌లో మీడియం రేంజ్ హీరోల మధ్య కఠినమైన పోటీ నడుస్తున్న సమయంలో నాని మాత్రం తన ప్రత్యేకమైన స్థాయిని సాధించుకున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ, విభిన్న కథలను ఎంచుకుంటూ, బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించడంలో నాని ఎప్పుడూ ముందుంటున్నాడు. డిసాస్టర్ అయిన కొన్ని సినిమాల తర్వాత కూడా ఆయన తన క్రేజ్‌ను కొనసాగించడం విశేషం.

ఇటీవల నాని చేసిన నాలుగు సినిమాలు కలిపి ఏకంగా 400 కోట్ల గ్రాస్ వసూలు చేశాయి. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ 3 సినిమాలు కలిపి ఈ అద్భుతమైన రికార్డును సాధించాయి. దాంతో మీడియం రేంజ్ హీరోల్లో నానిని అందుకోవడం మిగతావారికి సాధ్యం కావడం లేదు.

బ్లాక్‌బస్టర్ల లెక్కలు

దసరా సినిమా 115 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, హాయ్ నాన్న 74 కోట్ల మార్క్ చేరింది. ఆ తర్వాత సరిపోదా శనివారం 100 కోట్ల గ్రాస్‌తో నానిని మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. తాజాగా హిట్ 3 సినిమా 111 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ నాలుగు సినిమాల కలిపి లెక్క 400 కోట్లకు పైగా వెళ్లి నానిని మీడియం రేంజ్ హీరోల్లో లీడర్‌గా నిలిపింది.

అతిపెద్ద బడ్జెట్ మూవీ ప్యారడైజ్

ఇక ఇప్పుడు నాని తన కెరీర్‌లోనే అతిపెద్ద బడ్జెట్ మూవీ ‘ది ప్యారడైజ్’లో నటిస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. జడల్ అనే పాత్రలో నాని నెవ్వర్ బిఫోర్ లుక్‌లో కనబడబోతుండటంతో ఫ్యాన్స్‌లో భారీ హైప్ క్రియేట్ అయింది.

ఇండస్ట్రీలో టాక్ ఏమిటంటే

ప్యారడైజ్ సినిమాతో నాని కనీసం 200 కోట్ల గ్రాస్ మార్క్‌ను ఈజీగా చేరుకుంటాడని ఇండస్ట్రీలో బలమైన టాక్ వినిపిస్తోంది. సినిమాకు కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంటే 300 కోట్ల వరకు కూడా వెళ్లే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఎనిమిది భాషల్లో రిలీజ్ అవ్వడం వలన ప్యారడైజ్ పాన్ ఇండియా లెవెల్‌లో మంచి బాక్సాఫీస్ రేంజ్ చూపిస్తుందని అంచనా.

ఇప్పటి వరకూ సాధించిన 400 కోట్ల మార్క్‌తో పాటు, రాబోయే ప్యారడైజ్ విజయం సాధిస్తే నాని రేంజ్ మరో లెవెల్ కు వెళ్తుందని చెప్పవచ్చు. మీడియం రేంజ్ హీరోలలో మాత్రమే కాకుండా, టాప్ స్టార్ల సరసన కూడా నిలిచే అవకాశం ఉందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News