చీరకట్టులో తడి అందాలతో ఆకట్టుకుంటున్న హీరోయిన్!

తాజాగా తనకి ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా చీరకట్టులో రెండు జడలు వేసుకొని అందాలు ఆరబోస్తూ ఫోటోను పంచుకుంది.;

Update: 2026-05-01 11:11 GMT

సినిమాలలో అవకాశాలు లేకపోతేనేమ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చేరువ అవ్వచ్చు కదా అనే కోణంలో సెలబ్రిటీలు కూడా అందాలు ఆరబోస్తూ ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా అమ్మడి అందాలకు ఫాన్స్ ఫిదా అవ్వడమే కాకుండా ఫాలోవర్స్ గా కూడా మారుతున్నారు. ఇకపోతే అలా అందాలతో ఆకట్టుకుంటూ తడి అందాలతో చీరకట్టులో నెటిజన్స్ కి చెమటలు పట్టించిన బ్యూటీ నందిని రాయ్. ఈమె అసలు పేరు నీలం గౌహ్రాణీ.

 

తాజాగా తనకి ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా చీరకట్టులో రెండు జడలు వేసుకొని అందాలు ఆరబోస్తూ ఫోటోను పంచుకుంది. తెల్లచీరలో అందాలు ఆరబోస్తూ.. ఒక చేతిలో చెట్టు కొమ్మను పట్టుకొని.. మరొక చేతిలో మల్లెపూలు పట్టుకొని అభిమానులను తన అందాలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. ఈ ఫోటోని అభిమానులతో పంచుకుంటూ.." నేను చీర కట్టుకునే విధానంలో కవిత్వం ఉంది"అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. మొత్తానికి అయితే చాలా అందంగా ముస్తాబయి.. తడి అందాలతో వేసవి వేళ తొలకరి జల్లుల్లో తడుస్తూ మెస్మరైజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం నందిని షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

1990 సెప్టెంబర్ 18న హైదరాబాదులోని సింధీ కుటుంబంలో జన్మించిన ఈమె.. హైదరాబాద్ లోనే సెయింట్ ఆల్బమ్స్ హైస్కూల్లో తన స్కూల్ విద్యాభ్యాసాన్ని పూర్తిచేసింది. 2005లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈమె.. లండన్లో ఫైనాన్స్ లో ఎంబీఏ డిగ్రీ పూర్తి చేసింది. ఇండస్ట్రీలోకి రాకముందు మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె.. 80కి పైగా నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్లకు మోడల్ గా నటించింది. అంతేకాదు అనేక అందాల పోటీలలో కూడా పాల్గొన్న నందిని రాయ్.. 2008లో మిస్ హైదరాబాద్ 2008, మిస్ ఆంధ్ర ప్రదేశ్ 2010, మిస్ పాంటలూన్స్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ 2009, మిస్ బ్యూటిఫుల్ ఐస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2010 వంటి బహుమతులను సొంతం చేసుకుంది.

అలా అందాలతో అందర్నీ మెస్మరైజ్ చేసిన నందిని తొలిసారి ఫ్యామిలీ ప్యాక్ అనే హిందీ చిత్రంతో నటన రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత 040 అనే తెలుగు చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించిన ఈమె.. హార్మోన్స్ , మాయ, మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్, శివరంజని , పంచతంత్ర కథలు ఇలా పలు చిత్రాలు చేసి మెప్పించింది. తెలుగులోనే కాకుండా తమిళ్ , కన్నడ, హిందీ, మలయాళం భాషలో నటించి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించిన నందిని రాయ్.. నాని హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 పోటీ దారులలో ఒకరిగా నిలిచింది. ఇక అలాగే కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటించింది నందిని రాయ్.

Tags:    

Similar News