• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నందమూరి ఇంట విషాదం.. హీరో...

నందమూరి ఇంట విషాదం.. హీరో చైతన్య కృష్ణ తల్లి మృతి!

| తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పేరు మోసిన కుటుంబంగా పేరు సొంతం చేసుకున్న నందమూరి కుటుంబంలో తాజాగా విషాదఛాయలు అలుముకున్నాయి.

By - Madhu Reddy
Update: 2025-08-19 06:18 GMT

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పేరు మోసిన కుటుంబంగా పేరు సొంతం చేసుకున్న నందమూరి కుటుంబంలో తాజాగా విషాదఛాయలు అలుముకున్నాయి. స్వర్గీయ నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. ఈరోజు తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారట. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. అయితే చికిత్స తీసుకుంటూ ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.

పద్మజ మరణంతో నందమూరి కుటుంబంలో విషాదం నెలకొంది. పద్మజ.. జయకృష్ణ భార్య మాత్రమే కాదు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు స్వయాన సోదరి కూడా. అంటే ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరి..పద్మజ మరణవార్త విని విజయవాడలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఢిల్లీలో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి హుటాహుటిన హైదరాబాద్ ఫిలింనగర్ కి బయలుదేరినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం పద్మజ వయసు 73 సంవత్సరాలు.

నందమూరి జయకృష్ణ - దగ్గుబాటి పద్మజ దంపతుల కుమారుడు ఎవరో కాదు ప్రముఖ నందమూరి హీరో చైతన్య కృష్ణ. ఈయన తొలుత సినిమాటోగ్రాఫర్ గా కెరియర్ మొదలుపెట్టి..ఆ తర్వాత జగపతిబాబు హీరోగా వచ్చిన 'ధమ్' సినిమాతో నటుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే ఇందులో పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్ర పోషించడంతో ఆయనని ఎవరు గుర్తించలేదు. ఆ తరువాత 'బ్రీత్' అనే సినిమాతో హీరోగా మారి ప్రేక్షకులను పలకరించారు. కానీ మొదటి సినిమాతోనే భారీ డిజాస్టర్ ను మూటకట్టుకోవడం జరిగింది. ఈ సినిమా తర్వాత ఒక కో డైరెక్టర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు కానీ ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ఇంతలోనే తల్లి మరణం ఆయనను మరింత దిగ్భ్రాంతికి గురి చేస్తోందని చెప్పవచ్చు.

Tags:    
  • NandamuriFamily 
  • Padmaja 
  • Jayakrishna 
  • NTR 
  • ChaitanyaKrishna 
  • Tollywood 
  • Condolences 
  • CinemaNews 
  • RIP 
  • నందమూరికుటుంబం 
  • పద్మజ 
  • చైతన్యకృష్ణ 

Similar News

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

Copyright @2026

Powered by Blink CMS