కింగ్ డమ్ నుంచి వార్ 2 మీదకు వచ్చిన నాగవంశీ!

అయితే మొన్నటి వరకు కింగ్ డమ్ తో బిజీగా ఉన్న నాగవంశీ.. ఇప్పుడు వార్-2పై ఫోకస్ పెట్టారు.;

Update: 2025-08-07 09:54 GMT

టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఓ రేంజ్ లో మూవీస్ నిర్మిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అదే సమయంలో పలు చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలా నాగవంశీ కాంపౌండ్ నుంచి మూవీలు తెగ వస్తున్నాయి/ రానున్నాయి.

రీసెంట్ గా నాగవంశీ నిర్మించిన కింగ్ డమ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్టార్ హీరో విజయ్ దేవరకొండ లీడ్ రోల్ లో నటించిన ఆ సినిమా.. అన్నదమ్ముల కథతో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందింది. సినిమాలో కానిస్టేబుల్ సూరిగా విజయ్ దేవరకొండ మెప్పించారు. 

అయితే మొన్నటి వరకు కింగ్ డమ్ తో బిజీగా ఉన్న నాగవంశీ.. ఇప్పుడు వార్-2పై ఫోకస్ పెట్టారు. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, బీటౌన్ ప్రముఖ హీరో హృతిక్ రోషన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఆ మూవీని ఆయన తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. రూ.80 కోట్లకు పైగా వెచ్చించి థియేట్రికల్ రైట్స్ ను సొంతం చేసుకున్నారని టాక్.

ఆగస్టు 14వ తేదీన వార్-2 మూవీ రిలీజ్ కానుండగా.. ఇప్పటికే నాగవంశీ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశారు. తన కామెంట్స్ తో హైప్ క్రియేట్ చేశారు. ఎన్టీఆర్ ఇంట్రో అయితే చిరిగిపోద్ది అని, వార్ అంటేనే యుద్ధమని, ఇద్దరి మధ్య ఫైట్ సీన్స్ మామూలు లెవెల్ లో ఉండవని అంచనాలు పెంచారు. ఇప్పుడు లాంగ్ పోస్ట్ పెట్టారు.

"అభిమానులకు ఒక అద్భుతమైన విందు కానుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ తారక్, గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్.. ఇండియన్ ఫిల్మ్స్ ఇండస్ట్రీలో బెస్ట్ యాక్టర్స్ ఇద్దరూ కలిసి తొలిసారి సిల్వర్ స్క్రీన్ పైకి వస్తున్నారు. దీంతో ఎవరు ఉత్సాహంగా ఉండాలనుకోరు? సినిమాను చాలా శ్రద్ధగా రూపొందించారు" అంటూ నాగవంశీ కొనియాడారు.

"క్యాస్టింగ్ పెర్ఫామెన్స్ నుంచి డబ్బింగ్ వరకు ప్రతీ విషయంలో కంప్లీట్ ఫోకస్ చేశారు. ఫస్ట్-క్లాస్ సినిమాటిక్ అనుభవాన్ని అందించడానికి సిద్ధమయ్యారు. ఆగస్టు 14న తెలుగు రాష్ట్రాలలో భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్, గ్రాండ్ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాం. థియేటర్లలో వార్ కోసం సిద్ధమవ్వండి" అంటూ పిలుపునిచ్చారు. మరి వార్-2తో ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News