అక్కినేని బ్రదర్స్ మూవీస్.. అంతా కింగ్ అబ్జర్వేషన్ లోనేనా?

సాధారణంగా నాగార్జున తన కొడుకుల సినిమాల విషయంలో ఎప్పటి నుంచో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఎడిటింగ్, ప్రమోషన్ ప్లాన్స్, రిలీజ్ డేట్స్ సెలక్షన్ వంటి అంశాల్లో ఆయన సూచనలు ఇస్తారని సినీ వర్గాలు చెబుతుంటాయి.

Update: 2026-06-06 05:25 GMT

టాలీవుడ్ ప్రముఖ కాంపౌండ్ అక్కినేని ఫ్యామిలీకి చెందిన చిత్రాల విషయంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా నాగార్జున తన కుమారులు నాగచైతన్య, అఖిల్ నటిస్తున్న సినిమాల ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాల్లో గతంతో పోలిస్తే మరింత చురుగ్గా వ్యవహరిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అక్కినేని హీరోల కొత్త ప్రాజెక్టుల్లో అన్నపూర్ణ స్టూడియోస్ రోల్ పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సాధారణంగా నాగార్జున తన కొడుకుల సినిమాల విషయంలో ఎప్పటి నుంచో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఎడిటింగ్, ప్రమోషన్ ప్లాన్స్, రిలీజ్ డేట్స్ సెలక్షన్ వంటి అంశాల్లో ఆయన సూచనలు ఇస్తారని సినీ వర్గాలు చెబుతుంటాయి. అయితే ఇప్పుడు ఆయన రోల్ సలహాలకే పరిమితం కాకుండా ప్రొడక్షన్ పార్టనర్ గా వ్యవహరించడం వరకు విస్తరించినట్లు చర్చ సాగుతోంది.

అఖిల్ నటిస్తున్న లెనిన్ చిత్రం ఇందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా చెబుతున్నారు. మొదట ఆ సినిమాను సితార ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మిస్తుండగా, తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ కూడా సహ నిర్మాణ సంస్థగా చేరింది. దీంతో సినిమా పనుల్లో నాగార్జున అబ్జర్వేషన్ మరింత పెరిగిందనే ప్రచారం మొదలైంది. అలాగే నాగచైతన్యకు సంబంధించిన దూత వెబ్ సిరీస్ రెండో సీజన్ విషయంలోనూ ఇదే తరహా పరిస్థితి కనిపిస్తోందని సమాచారం.

అమెజాన్ మద్దతుతో నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తున్న ఆ ప్రాజెక్టులో అన్నపూర్ణ స్టూడియోస్ భాగస్వామిగా చేరినట్లు తెలుస్తోంది. దీంతో చైతన్య, అఖిల్ ప్రాజెక్టులపై అన్నపూర్ణ సంస్థ ఫోకస్ పెరుగుతోందని సమాచారం. వినిపిస్తున్న సమాచారం ప్రకారం, చైతన్య- అఖిల్ ఇద్దరూ తమ తండ్రి అనుభవాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని భావిస్తున్నారట.

దాదాపు 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న నాగార్జున గైడెన్స్ ఉంటే సినిమాల క్వాలిటీ పెరుగుతుందనే నమ్మకంతో ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే నిర్మాణ బాధ్యతల్లో అన్నపూర్ణ స్టూడియోస్ భాగస్వామ్యం పెరుగుతోందని టాక్ వినిపిస్తోంది. ఇక టెక్నికల్ ఫెసిలిటీస్ పరంగా కూడా అన్నపూర్ణ స్టూడియోస్‌ కు మంచి పేరుంది. షూటింగ్ తర్వాత జరిగే డబ్బింగ్, డీఐ, ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి అనేక పనులు అక్కడే పూర్తయ్యే అవకాశం ఉండటంతో, ప్రొడక్షన్ పార్టనర్ గా ఉండడం ప్రాజెక్టులకు ప్లస్ గా మారనుంది.

మరోవైపు అఖిల్ కెరీర్‌ కు లెనిన్ సినిమా చాలా కీలకంగా మారింది. వరుస డిజాస్టర్ల తర్వాత అఖిల్‌ కు కమ్ బ్యాక్ మూవీ అవసరమైన సమయంలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. జూన్ 26న విడుదల కానున్న ఆ చిత్రంపై నాగార్జున కూడా భారీ ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. స్టోరీ, ప్రొడక్షన్ వాల్యూస్, మార్కెటింగ్ విషయంలో ఆయన స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది.

అయితే నాగార్జున నిజంగానే కొడుకుల ప్రాజెక్టులను పూర్తిగా తన గ్రిప్ లోకి తీసుకుంటున్నారా? లేక క్వాలిటీ పరంగా బెస్ట్ రిజల్ట్ కోసం అబ్జర్వేషన్ మాత్రమే పెంచుతున్నారా? అనే ప్రశ్నకు సమాధానం మాత్రం ఇంకా రావాల్సి ఉంది. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే అక్కినేని హీరోల ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో అన్నపూర్ణ స్టూడియోస్ పాత్ర మరింత కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News