నాగార్జునకు లంచ్ లో తప్పని సరి కర్రీ ఇదే!
కింగ్ నాగార్జున డైట్ ప్లాన్ ఎలా ఉంటుందన్నది తెలిసిందే. సోమవారం నుంచి శనివారం వరకూ మితంగా ఆహారం తీసుకుంటారు.;
కింగ్ నాగార్జున డైట్ ప్లాన్ ఎలా ఉంటుందన్నది తెలిసిందే. సోమవారం నుంచి శనివారం వరకూ మితంగా ఆహారం తీసుకుంటారు. అవన్నీ వెజిటేరియన్ వంటకాలతోనే ఉంటాయి. పళ్లు ఫలహారాలు సహజంగా ఉంటాయి. ఆదివారం మాత్రం నచ్చింది తింటారు. నాన్ వెజ్ లో కావాల్సిన వంటకాలన్నీ వండించుకుంటారు. ఆరోజు మాత్రం కడుపు నిండా తింటారు. అలాగే రెగ్యులర్ గా వాటర్ ఎక్కువగా తీసుకోవడం చాలా కాలంగా ఉన్న అలవాటు. తన గ్లామర్ సీక్రెట్ ఏంటి? అంటే వాటర్ అనే చెబుతుంటారు. మరి నాన్ వెజ్ ని మించి వెజ్ లో బాగా ఇష్టపడే కర్రీ ఏది? అంటే బెండకాయ కర్రీ అంటే అమితంగా ఇష్ట పడతారని తెలిసింది.
బెండకాయ సీక్రెట్ అదా?
రోజూ లంచ్ లో కి ఏమున్నా? లేకపోయినా? బెండ కాయ కర్రీ మాత్రం తప్పని సరి అట. ఆ కర్రీ లేకుండా నాగార్జున లంచ్ ఉండదన్నారు. ఇంట్లో ఉన్నా? షూటింగ్ లో ఉన్నా? ఆ కర్రీ మాత్రంలో లంచ్ లో ఉండేలా చూసుకుం టారుట. అందుకు ప్రత్యేక కారణం లేకపోలేదు. బెండకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. అన్నిరకాల పోషకాలు బెండకాలో ఉన్నాయి. విటమిన్స్ కావాలంటే రకరకాల పండ్లు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ బెండకాయ తీసుకుంటే ? అన్ని రకాల పోషకాలు అందులోనే దొరుకుతాయి. విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ కె, విటమిన్ బి12, పొటాషియం, ఫైబర్,క్యాల్షియం, మాంగనీస్, కాపర్, సెలీనియం అన్నీ సమృద్దిగా బెండకాయలో ఉంటాయి.
మూడు రోజులైనా తప్పనిసరి:
అందుకే నాగార్జున లంచ్ లో బెండకాయ భాగంగా మారింది. సాధారణంగా బెండకాయ అంటే చాలా మంది తినడానికి అయిష్టత చూపిస్తారు. రుచి లేని కూరగాయగా అభివర్ణిస్తారు. కానీ నాగార్జున రుచి కంటే పోషకాలు కోసం ఆరగిస్తున్నారు. అలాగే బాలకృష్ణకు బంగాళ దుంపలంటే ఇష్టం. వారంలో మూడు రోజులైనా లంచ్ లో బంగాళ దుంప వేపుడు ఉండేలా చూసుకుంటారు. కాంబినేషన్ సాంబర్ రెడీ చేయించుకుంటారు. బాలయ్య కు అన్నిరకాల వంటకాలు తయారు చేసే స్పెషల్ చెఫ్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.
నాగార్జున సలహాతోనే చిరంజీవి:
అలాగే చిరంజీవికి కోడిగుడ్డు..ఎండు చేపల పులసుకు అంటే ఇష్టం. ఈ రుచి చిరుకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. అయితే చిరంజీవి ఇప్పుడా రుచులకు దూరంగా ఉంటున్నారు. లుక్ పరంగా మార్పులు తీసుకు రావడంతో? డైట్ ఫాల్ అవుతున్నారు. ఆ డైట్ ప్లానింగ్ కూడా నాగార్జున ఇచ్చిందేనని సమాచారం. నాగార్జున తీసుకుంటున్న ఆహారాన్నే చిరంజీవి కూడా కొన్ని నెలలుగా తీసుకుంటున్నట్లు వినిపిస్తోంది. గతంలో నాగార్జునను చిరంజీవి డైట్ సలహాలు సూచించిమని అడిగిన సంగతి తెలిసిందే.