సైమన్ సక్సెస్ అయితే కింగ్ 2.0!
నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో అక్కినేని నాగార్జున కేవలం హీరోగానే అలరించారు. ఎన్నో సిని మాల్లో వైవిథ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు.;
నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో అక్కినేని నాగార్జున కేవలం హీరోగానే అలరించారు. ఎన్నో సిని మాల్లో వైవిథ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ కొన్ని పేజీలు రాసుకున్నారు. ఏఎన్నార్ నట వారసత్వాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నారు. వయసు 60 దాటినా? అది జస్ట్ నెంబర్ మాత్రమేనని...తానిప్పటికీ నవ మన్మధుడిగానే నీరాజనాలు అందుకుంటున్నారు. ఇది కేవలం నాగార్జునకు మాత్రమే సాధ్యమైంది.
తొలిసారి విలన్ గా ఆయనతోనే:
నటుడిగానూ అంతే అప్ డేట్ గా పని చేయడం నాగ్ కి మాత్రమే సాధ్యమైంది. సోలో సినిమాలు చేయలన్నా? ఇతర స్టార్లతో కలిసి మల్టీస్టారర్స్ చేయాలన్నా కింగ్ ఎప్పుడూ ముందుంటారు. తనయులతో కూడా కలిసి తెరను పంచుకుంటూ కెరీర్ పరంగా ముందుకెళ్తున్నారు. సరిగ్గా ఇదే దశలో నాగార్జున ఇటీవలే ఓ కొత్త టర్నింగ్ తీసుకున్న సంగతి తెలిసిందే. 'కుబేర' చిత్రంలో ఈడీ ఆఫీసర్ పాత్రలో అలరించారు. అయితే ఆ పాత్రలో కాస్త నెగివిటీ కూడా కనిపిస్తుంది. చేయని తప్పుకు జైలుకెళ్లిన ఆఫీసర్ తానెందుకు నిజాయితీగా పనిచేయాలి? అన్న ఆలోచనతో పాత్రలో నెగివిటీ ప్రారంభమవుతుంది.
ఛాన్స్ మిస్ చేసుకున్న సూపర్ స్టార్:
క్లైమాక్స్ లో ఆ పాత్రను పాజిటివ్ గానే శేఖర్ కమ్ములా ముగించినా? `కుబేర` ద్వారా కింగ్ లో నెగివిటీని తెరపైకి తెచ్చిన తొలి డైరెక్టర్ గా నమోదయ్యారు. ఇప్పుడు అదే నాగ్ `కూలీ` చిత్రంలో శక్తివంతమైన సైమన్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో హీరో పాత్రలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్నా? ఆయనకంటే ఎక్కువగా వైరల్ అవుతుంది విలన్ సైమన్ మాత్రమే. ఈ పాత్రలో నటించే ఛాన్స్ తనకే ఇస్తే బాగుండేదని రజనీ సైతం అభిప్రాయపడ్డారు? అంటే సినిమాలో సైమన్ పాత్ర ప్రత్యేకత ఏంటన్నది అద్దం పడుతుంది.
రజనీకాంత్ కంటే సైమన్ హైలైట్:
దీంతో ఆ పాత్రపై ఆసక్తి అంతకంతకు రెట్టింపు అవుతుంది. సైమన్ పాత్ర ఎలా ఉండబోతుంది? అన్నది సర్వత్రా చర్చకొస్తుంది. కింగ్ ఆ పాత్రలో ఎలా కనిపిస్తారు? ఎలాంటి నటనతో ఆకట్టుకుంటారని అక్కినేని అభిమానులతా ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. సినిమాలో రజనీ పాత్రకు ధీటుగా ఉంటుందని విషయం లీకైంది. సినిమా సక్సెస్ అయితే రజనీ కంటే ఎక్కువ పేరు నాగార్జునకే దక్కుతుంది? అన్నది మార్కెట్ లో గట్టిగా వినిపిస్తోన్న మాట. ఒకవేళ అదే జరిగితే కింగ్ లో 2.0 ని చూడొచ్చు.
తెలివైన నిర్ణయం:
ప్రస్తుతం మారిన తెలుగు సినిమా ట్రెండ్ నేపథ్యంలో నాగార్జున మరిన్ని అద్బుతాలు చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయరు. పాన్ ఇండియాలో తెలుగు సినిమాకు వచ్చిన గుర్తింపును కింగ్ అంతే తెలివిగా ఎన్ క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. మరిన్ని చిత్రాల్లో పవర్ పుల్ కింగ్ ను అభిమానులు చూసుకోవచ్చు. ఓవైపు హీరోగా అలరిస్తూనే విలన్ గానూ మరిన్ని సంచలనాలకు ఆస్కారం ఉంది. మరి కింగ్ మైండ్ లో ఏముందో.