తండేల్ తర్వాత NC 24 నెక్స్ట్ లెవెల్ ప్లాన్..!

అక్కినేని హీరో నాగ చైతన్య లాస్ట్ ఇయర్ కస్టడీ నిరాశపరచడంతో ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే అనుకుంటూ తండేల్ తో వస్తున్నాడు

Update: 2024-05-06 03:30 GMT

అక్కినేని హీరో నాగ చైతన్య లాస్ట్ ఇయర్ కస్టడీ నిరాశపరచడంతో ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే అనుకుంటూ తండేల్ తో వస్తున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తండేల్ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో నాగ చైతన్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ మూవీ వస్తుంది. తనతో లవ్ స్టోరీ సినిమా చేసిన సాయి పల్లవిత్తోనే తండేల్ లో కూడా జత కడుతున్నాడు నాగ చైతన్య. ఈ సినిమాకు సాయి పల్లవి కూడా వన్ ఆఫ్ ది మేజర్ హైలెట్ అవుతుందని అంటున్నారు. తండేల్ సినిమాతో కెరీర్ లో మొదటిసారి పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు నాగ చైతన్య.

ఆల్రెడీ కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న చందు మొండేటి ఈ సినిమాను కూడా అందుకు తగినట్టుగానే ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే నాగ చైతన్య నెక్స్ట్ సినిమా కూడా భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట. తండేల్ తో ఎలాగు పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్న నాగ చైతన్య నెక్స్ట్ సినిమాను కూడా అదే రేంజ్ లో తీసుకెళ్లాలని చూస్తున్నారట. నాగ చైతన్య 24వ సినిమా కార్తీక్ దండు డైరెక్షన్ లో ఫిక్స్ అయ్యింది.

విరూపాక్ష సినిమా తర్వాత కార్తీక్ దండు చేస్తున్న ఈ మూవీపై సూపర్ క్రేజ్ ఏర్పడింది. అయితే నాగ చైతన్యతో తను తీసే సినిమాను కూడా నేషనల్ లెవెల్ అప్పీల్ ఉండేలా చూస్తున్నారట. విరూపాక్ష తరహాలోనే థ్రిల్లింగ్ అంశాలతో చైతన్య 24వ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దేని తీసుకుంటారని టాక్. సో చైతు పాన్ ఇండియా ప్లానింగ్ లో భాగంగానే 24వ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

తండేల్ సినిమా డిసెంబర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమా ఏర్పరచిన ఇంపాక్ట్ ని బట్టి కార్తీక్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. తండేల్ తో అక్కినేని హీరో నేషనల్ లెవెల్ లో తన సత్తా చూపించాలని ఫిక్స్ అయ్యాడు. తండేల్ తర్వాత సినిమా కూడా అందుకు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సో అక్కినేని ఫ్యాన్స్ నాగ చైతన్య నుంచి రాబోతున్న రెండు సినిమాలతో పండుగ చేసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు

Tags:    

Similar News