చైతూ సినిమా సగం కూడా పూర్తవకుండానే..
ఒక సినిమాకు బజ్ ఏ మూలంగా వస్తుందో ఎవరూ చెప్పలేం. కొన్నిసార్లు ఎవరూ ఊహించని రీతిలో సినిమాలకు బజ్ వస్తూ ఉంటుంది.;
ఒక సినిమాకు బజ్ ఏ మూలంగా వస్తుందో ఎవరూ చెప్పలేం. కొన్నిసార్లు ఎవరూ ఊహించని రీతిలో సినిమాలకు బజ్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కూడా అలానే హైప్ పెరిగింది. తండేల్ తర్వాత నాగ చైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
విరూపాక్ష సినిమాతో టాలీవుడ్ కు డైరెక్టర్ గా పరిచయం అయిన కార్తీక్ దండు మొదటి సినిమాతోనే డైరెక్టర్ గా తన సత్తా ఏంటో చాటాడు. మిస్టిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన విరూపాక్ష సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విరూపాక్ష తర్వాత కార్తీక్ తన నెక్ట్స్ మూవీని అక్కినేని నాగ చైతన్యతో చేస్తున్నాడు. ఈ సినిమా చైతూ కెరీర్లో 24వ సినిమాగా తెరకెక్కుతోంది.
రీసెంట్ గానే సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా కూడా మిస్టిక్ థ్రిల్లర్ గానే రూపొందుతుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికి 10% షూటింగ్ మాత్రమే పూర్తి చేసుకుంది. ఇక అసలు విషయానికొస్తే ఈ సినిమా షూటింగ్ కనీసం సగం కూడా పూర్తవకముందే సినిమా వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి.
ఏపీ, నైజాం, సీడెడ్, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ ఇలా ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్ హక్కులను సితార సంస్థ తరపున నాగవంశీ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. రూ.30 నుంచి రూ.40 కోట్ల మధ్యలో వంశీ ఈ డీల్ ను క్లోజ్ చేసినట్టు సమాచారం. ఓ రకంగా చెప్పాలంటే నిర్మాతలకు ఇది చాలా మంచి డీల్. డీల్ ను క్లోజ్ చేశాడంటే నాగవంశీ ఎంతలేదన్నా నిర్మాతలకు సగమైనా డబ్బులివ్వాలి.
సినిమా రీసెంట్ గానే మొదలైంది కాబట్టి షూటింగ్ పూర్తై రిలీజవడానికి ఎంతలేదన్నా ఏడాది పడుతుంది. ఇన్ని రోజులు ఆ మొత్తానికి వడ్డీలు కూడా కాలిక్యులేట్ అవుతాయి. ఏమైనా NC24కు ఈ డీల్ తో మంచి బిజినెస్ జరిగిందనే చెప్పాలి. ఈ బిజినెస్ తో పాటూ సినిమాకు మంచి బజ్ కూడా ఏర్పడింది. కార్తీక్ నుంచి వచ్చిన విరూపాక్ష బ్లాక్ బస్టర్ అవడంతో పాటూ చైతన్య నుంచి రీసెంట్ గా వచ్చిన తండేల్ కూడా బ్లాక్ బస్టర్ అవడం కూడా ఈ డీల్ కు బాగా కలిసొచ్చిందని చెప్పాలి.