చై- సామ్ విడిపోయినా కలిపి ఉంచిన బంధం?
అయితే చై, సమంత ఇద్దరితో ముడిపడి ఉన్న హాష్ (పెట్ డాగ్) పరిస్థితేంటి? ఆ ఇద్దరూ ఎవరి దారిలో వారు ఉంటే, తనను పట్టించుకునేది ఎవరు?;
గత ఏడాది డిసెంబర్‌లో నాగ చైతన్య శోభితా ధూళిపాలను వివాహం చేసుకున్న తర్వాత చై-సామ్ తిరిగి కలిసే అవకాశం ఉందనే అన్ని వార్తలకు చెక్ పడింది. కానీ చై- సామ్ మధ్య పరస్పర గౌరవం స్పష్టంగా ఉంది. ఇద్దరు తారలు ప్రస్తుతం వారి వ్యక్తిగత కెరీర్‌లపై దృష్టి సారించారు. సమంత పాన్-ఇండియా ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా ఉన్నారు. నాగ చైతన్య `తండేల్` ఘనవిజయం సాధించడంతో రెట్టించిన ఉత్సాహంలో తదుపరి విడుదలలను క్యూలో ఉంచాడు.
అయితే చై, సమంత ఇద్దరితో ముడిపడి ఉన్న హాష్ (పెట్ డాగ్) పరిస్థితేంటి? ఆ ఇద్దరూ ఎవరి దారిలో వారు ఉంటే, తనను పట్టించుకునేది ఎవరు? ఆలనా పాలనా చూసేది ఎవరు? అనే సందేహం ఇన్నాళ్లు అలానే ఉంది. కానీ హాష్ కి అలాంటి ఇబ్బంది ఏదీ లేదు. అది సమంతతో ఎంతో ఒద్దికగా కలిసిపోయి జీవిస్తోంది. అదే సమయంలో చైతూ వద్దకు కూడా వెళ్లి వస్తోంది.
ఆ ఇద్దరూ కోపేరెంటింగ్ చేస్తూ దానిని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. హాష్ విషయంలో వారి ఉమ్మడి శ్రద్ధ అందరి దృష్టిని ఆకర్సిస్తోంది. కొన్ని బంధాలు విడిపోయిన తర్వాత స్నేహంగా మారుతున్నాయి. ఆ ఇద్దరినీ కలిపే ఏదో ఒక శక్తి వారి మధ్యకు చేరుతోంది. ముఖ్యంగా తమ కుటుంబంలో ఒక భాగం అయిన హాష్ కి ఎడబాటు లేకుండా మామ్ డాడీలా ఈ ఇద్దరూ ఉన్నారు.
రెడ్డిటర్ల పుణ్యమా అని చై- సామ్ ఇద్దరి కామన్ బంధువు ఎవరో మనకు స్పష్ఠంగా తెలుస్తోంది. ఓసారి సామ్ తో హాష్ కనిపిస్తుంది. ఇంకోసారి చైతన్యతో జిమ్ లో ఆటలాడుతూ కనిపిస్తుంది. ఇలా పలుమార్లు హాష్ తో వారి అనుబంధం బయటపడింది. తల్లిదండ్రులు విడిపోయినంత మాత్రాన పిల్లలకు అన్యాయం జరగకూడదు. మూగ జీవాలను కూడా బ్రేకప్ అయిన జంటలు ఇలా సాకడం నిజంగా హర్షించదగినది. విడిపోయాక కూడా పెట్స్ కి కోపేరెంటింగ్ చేయడం వారి పెద్ద మనసును ఆవిష్కరిస్తుంది. ఇది పది మందికి స్ఫూర్తినిస్తుంది.