చైతూ కోసం దాంతో పాటూ మరో రెండు టైటిల్స్ కూడా
నాగ చైతన్య కెరీర్లో 24వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ తో పాటూ మూవీ సర్కిల్స్ లో కూడా మంచి బజ్ నెలకొంది.;
గత కొన్ని సినిమాలుగా సక్సెస్ లేక ఇబ్బంది పడిన అక్కినేని నాగ చైతన్య తండేల్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుని ఆ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు. తండేల్ హిట్ తర్వాత ఫుల్ జోష్ లో ఉన్న చైతన్య ప్రస్తుతం విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విరూపాక్ష తర్వాత కార్తీక్ నుంచి వస్తున్న సినిమా కావడం, తండేల్ తర్వాత చైతూ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి.
నాగ చైతన్య కెరీర్లో 24వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ తో పాటూ మూవీ సర్కిల్స్ లో కూడా మంచి బజ్ నెలకొంది. విరూపాక్ష సినిమాలానే ఈ సినిమాను కూడా కార్తీక్ దండు మిస్టిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో రీసెంట్ గానే ఓ భారీ గుహను కూడా సెట్ వేసినట్టు వార్తలొచ్చాయి.
NC24 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మేకర్స్ మూడు టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ ఈ టైటిల్ కు వృషకర్మ అనే టైటిల్ ను ఆల్మోస్ట్ ఫిక్స్ చేశారని వార్తలొచ్చినప్పటికీ ఇప్పుడు మరో రెండు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. డైరెక్టర్ కార్తీక్ దండు ఈ సినిమాకు మంచి పవర్‌ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేయాలని చూస్తున్నాడట.
మరి అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మేకర్స్ ఏ టైటిల్ ను ఫిక్స్ చేస్తారు? వృషకర్మ కాకుండా కార్తీక్ మనసులో ఉన్న మరో రెండు టైటిల్స్ ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.