నాగ్ అశ్విన్ ఇప్పుడేం చేస్తున్నారంటే..
టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు తీసిన సినిమాలు తక్కువే అయినా.. ఓ రేంజ్ లో ఫేమ్ సంపాదించుకున్నారు.;
టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు తీసిన సినిమాలు తక్కువే అయినా.. ఓ రేంజ్ లో ఫేమ్ సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఒక్కసారి పాన్ ఇండియా లెవెల్ లో అందరి దృష్టి ఆయనపై పడేలా చేసుకున్నారని చెప్పాలి.
డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వకముందు స్క్రీన్ రైటర్ గా.. అసిస్టెంట్ డైరెక్టర్ గా నాగ్ అశ్విన్ వర్క్ చేశారు. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల వద్ద లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశారు. ఆ తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ్విన్.. డెబ్యూతో అందరినీ ఫిదా చేశారు.
ఆ తర్వాత మహానటి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డారు. ఇక కల్కి 2898 ఏడీ మూవీతో కెరీర్ లో పెద్ద హిట్ ను సొంతం చేసుకున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆ సినిమాతో నేషనల్ వైడ్ గా మెప్పించారు. ఆ తర్వాత కల్కి సినిమాకు సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు.
ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ పార్ట్ కాస్త కంప్లీట్ అయినప్పటికీ.. రెగ్యులర్ షూటింగ్ మొదలు కావడానికి టైమ్ పడుతుంది. ముఖ్యంగా ప్రభాస్ అనేక భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. దీంతో ఆయన ఫ్రీ కావడానికి ఇంకా కొన్ని నెలల సమయం పడుతుంది. అప్పటి వరకు నాగ్ అశ్విన్ ఖాళీనే. దీంతో ఆయన ఇప్పుడేం చేస్తున్నారో తెలిస్తే షాకవ్వడం ఖాయం.
సైలెంట్ గా ఓ చిన్న సినిమాను తెరకెక్కిస్తున్నారని ఇప్పుడు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయన ఇప్పటికే తీసిన ఎవడే సుబ్రహ్మణ్యం స్టైల్ లో.. ఓ సెన్సిబుల్ స్టోరీతో మరో మూవీ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా నిర్వహిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం చెన్నైలో చిత్రీకరణ జరుగుతోందని వినికిడి.
మూవీలో అంతా కొత్తవాళ్లే నటిస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాక అన్ని వివరాలు ప్రకటించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది సినిమాను విడుదల చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. కల్కి-2 మూవీ స్టార్ట్ అవ్వడానికి టైమ్ పట్టే క్రమంలోనే ఖాళీగా ఉండకుండా గప్ చుప్ గా మూవీ రూపొందిస్తున్నారని వినికిడి. మరి ఇందులో నిజమెంత ఉందో వేచి చూడాలి.