అమ్మ లుక్ ను రీ క్రియేట్ చేసిన నభా నటేష్.. ఎంత క్యూట్ గా ఉందో!
ఈ ఫోటోలను షేర్ చేయడమే కాకుండా ఈ దీపావళికి అమ్మ చీరను కట్టుకున్నాను.. అందరికీ హ్యాపీ దీపావళి అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. ఈ చీరలో తన అందంతో మరింత గ్లామర్ గా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ.;
ప్రస్తుత కాలంలో హీరోయిన్లు చాలామంది తమ తల్లులకు సంబంధించిన చీరలను మళ్లీ రీ క్రియేట్ చేసి ధరిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పెళ్లిళ్లకు తమ తల్లులు వారి పెళ్లిళ్లలో కట్టుకున్న చీరలకు.. ఇప్పటి ఆధునికతను జోడిస్తూ మరింత ట్రెండింగ్ గా మార్చేస్తున్నారు. ఇప్పటికే సమంత, నిహారిక ఇలా ఎంతోమంది హీరోయిన్స్ తమ పెళ్లిళ్ల సమయంలో తమ తల్లులు కట్టుకున్న చీరలను మళ్లీ రీ డిజైన్ చేయించి అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు దివాళి సెలబ్రేషన్స్ లో భాగంగా ప్రముఖ హీరోయిన్ నభా నటేష్ కూడా తన తల్లి కట్టుకున్న చీరను మళ్లీ డిజైన్ చేయించి కట్టుకోవడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది.
ముఖ్యంగా తన తల్లి లుక్ ను రీ క్రియేట్ చేస్తూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె.. ఈమధ్య పలురకాల ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా దీపావళి సందర్భంగా తన తల్లి కట్టుకున్న చీరను ఆమె కూడా ధరించి మరింత అందంగా ముస్తాబయింది. ఆధునికతకు తగ్గట్టుగా బ్లౌజ్ డిజైన్ చేయించుకున్న నభా నటేష్.. సింపుల్ జువెలరీతో అందంగా ముస్తాబయింది. జుట్టును ముడిపెట్టి.. దానికి పువ్వులు పెట్టి తన స్టైల్ ను మరింత అందంగా మార్చుకుంది. చేతిలో దీపాలు పట్టుకొని చాలా స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది నభా నటేష్.
ఈ ఫోటోలను షేర్ చేయడమే కాకుండా ఈ దీపావళికి అమ్మ చీరను కట్టుకున్నాను.. అందరికీ హ్యాపీ దీపావళి అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. ఈ చీరలో తన అందంతో మరింత గ్లామర్ గా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం నభానటేష్ షేర్ చేసిన ఫోటోలపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది దీపావళి శుభాకాంక్షలు చెబుతుంటే.. మరికొంతమంది సూపర్ అని.. ఇంకొంతమంది నన్ను పెళ్లి చేసుకో అని ఇలా పలు రకాల కామెంట్లతో కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ఆకట్టుకుంటున్నాయి.
నభా నటేష్ 1995 డిసెంబర్ 11 కర్ణాటక రాష్ట్రం చిక్మంగళూరు జిల్లా శృంగేరిలో జన్మించింది. ఇన్ఫర్మేషన్ సైన్స్ లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసిన ఈమె.. 2015లో శివరాజ్ కుమార్ తో కలిసి కన్నడ మూవీ వజ్రకాయలో నటించింది.ఈ సినిమాతో ఇండస్ట్రీకి అరంగేట్రం చేసిన ఈమె.. 2013లో ఫెమినా మిస్ ఇండియా బెంగళూరు 2013లో టాప్ టెన్ లో ఒకరిగా నిలిచింది.
2018లో వచ్చిన నన్ను దోచుకుందువటే అనే చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నభా నటేష్.. అదుగో, ఇస్మార్ట్ శంకర్ , డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ.