ముంబై ఫిలిం ఫెస్టివ‌ల్ ర‌ద్దున‌కు కార‌ణం?

అయితే ముంబై ఫిలింఫెస్టివ‌ల్ 28 ఏళ్లలో రద్దు కావడం ఇదే తొలిసారి.. దీనితో సినీ ప్రియులు, పరిశ్రమలోని వ్యక్తులు నిరాశకు గురయ్యారు.;

Update: 2025-07-23 03:25 GMT

ముంబై అకాడెమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్.. MAMI ముంబైలో జ‌రిగే అతిపెద్ద అంత‌ర్జాతీయ ఫిలింఫెస్టివ‌ల్. ఈ వేదిక‌పై భార‌తీయ సినిమాల‌తో పాటు, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న సినీప‌రిశ్ర‌మ‌ల నుంచి వ‌చ్చే సినిమాల‌ను ప్ర‌ద‌ర్శిస్తారు. కోలాహాలం పెద్ద స్థాయిలో ఉంటుంది. అయితే ఈసారి స‌డెన్ గా ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ ర‌ద్ద‌యింది! అంటూ ప్ర‌క‌టించ‌డం పెద్ద షాకిచ్చింది.

ప్ర‌పంచ సినిమాకు ముంబై వేదికగా సినిమాకు ఇచ్చే గుర్తింపు ఈ ఏడాది లేదు! అంటే .. అది నిజంగా అంద‌రికీ షాకిచ్చే విష‌యం. ఉత్సవం రద్దు చేయడం నిజంగా విచార‌క‌రం. దీనివ‌ల్ల గ్లోబ‌ల్ ప్ర‌పంచంలో మ‌న గుర్తింపు త‌గ్గిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా స్వతంత్ర, ప్రాంతీయ సినిమాలు, క్లాసిక్ సినిమాలలో అత్యుత్తమమైన వాటిని ప్రదర్శించడానికి ప్రధాన వేదికగా ముంబై ఫిలింఫెస్టివ‌ల్ జ‌రుగుతోంది. 2026లో మాత్ర‌మే ఈ ఉత్సవం జ‌ర‌గ‌నుందని ధృవీక‌రించారు.

అయితే ముంబై ఫిలింఫెస్టివ‌ల్ 28 ఏళ్లలో రద్దు కావడం ఇదే తొలిసారి.. దీనితో సినీ ప్రియులు, పరిశ్రమలోని వ్యక్తులు నిరాశకు గురయ్యారు. చాలా మంది ఫిలింమేక‌ర్స్ త‌మ అసంతృప్తిని వ్య‌క్తం చేసారు. అయితే ఉత్స‌వాలు జ‌రిగే వెన్యూ స్థ‌లం పున‌రుద్ధ‌రణ కార‌ణంగా ఉత్స‌వాల‌ను ర‌ద్దు చేసిన‌ట్టు ప్ర‌క‌టించారు. మ‌రో ఏడాదిలో అన్ని ఏర్పాట్ల‌తో ముంబై సిద్ధంగా ఉంటుంద‌ని భావిద్దాం.

Tags:    

Similar News