• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సీనియ‌ర్ న‌టుడిపై...

సీనియ‌ర్ న‌టుడిపై విరుచుకుప‌డ్డ‌ తండ్రి కూతుళ్లు

| దీనికి కార‌ణం కొన్నేళ్ల క్రితం కేబీసీ రియాలిటీ షోలో సోనాక్షి రామాయ‌ణంపై సింపుల్ ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్ చేయ‌లేక‌పోవ‌డ‌మే.

By - Tupaki Desk
Update: 2024-12-18 06:21 GMT

తెలిసో తెలియ‌కో, అవ‌గాహ‌న ఉండో లేకో.. మీడియా ముందు ఏదైనా కామెంట్ చేస్తే దాని ప‌ర్య‌వ‌సానం ఎలా ఉంటుందో ఇప్ప‌టికే చాలా మంది సెల‌బ్రిటీలు అనుభ‌వ పూర్వ‌కంగా తెలుసుకున్నారు. అలాంటి ఒక కామెంట్ కార‌ణంగా బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు ముఖేష్ ఖ‌న్నా తండ్రి కూతుళ్ల‌తో చీవాట్లు తినాల్సి వ‌స్తోంది. శ‌క్తిమాన్ గా సుప్ర‌సిద్ధుడైన ముఖేష్ జీ ఇటీవ‌ల న‌టి సోనాక్షి సిన్హా తండ్రి శ‌త్రుఘ్న సిన్హా పెంప‌కాన్ని ఆక్షేపించారు. కూతురి పెంప‌కం స‌రిగా లేద‌ని విమ‌ర్శించారు. దీనికి కార‌ణం కొన్నేళ్ల క్రితం కేబీసీ రియాలిటీ షోలో సోనాక్షి రామాయ‌ణంపై సింపుల్ ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్ చేయ‌లేక‌పోవ‌డ‌మే.

పాత విష‌యాన్ని ఇప్పుడు గుర్తు చేస్తూ న‌టుడు ముఖేష్ ఖ‌న్నా సూటిగా శత్రుఘ్న సిన్హాను విమ‌ర్శించారు. పురాణేతిహాసం రామాయ‌ణం గురించి కుమార్తెకు నేర్పించ‌లేద‌ని షాట్ గ‌న్ శ‌త్రుఘ్న గురించి ఎత్తి చూపాడు. అయితే అత‌డి వ్యాఖ్య‌ల‌కు సోనాక్షి ధీటుగా స్పందించింది. త‌న తండ్రిని అంటే స‌హించేది లేద‌ని హెచ్చ‌రించింది. నాకు నా కుటుంబానికి న‌ష్టం క‌లిగిస్తూ ప‌దే ప‌దే అదే సంఘ‌ట‌న‌ను తెర‌పైకి తేవ‌డాన్ని సోనాక్షి త‌ప్పు ప‌ట్టింది. దీనిని ఆపాల‌ని కూడా ముఖేష్ ఖ‌న్నాను కోరింది. న‌టుడు ముఖేష్ ఉద్ధేశ‌పూర్వ‌కంగా త‌న‌ను, త‌న కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నాడ‌ని సోనాక్షి సీరియ‌స్ అయ్యారు. రాముడు బోధించిన క్షమా గుణం నేర్చుకోవాల‌ని ముఖేష్ కి సూచించారు సోనాక్షి.

ఇప్పుడు సోనాక్షి తండ్రి శ‌త్రుఘ్న సిన్హా దీనిపై స్పందించారు. ముఖేష్ ఖ‌న్నా వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న ఖండించారు. తన పిల్లలందరూ త‌న‌కు గర్వకారణమని శతృఘ్న అన్నారు. సోనాక్షి మంచి హిందువు కాబట్టి ఎవరి దగ్గరా ఎలాంటి సర్టిఫికేట్ పొందాల్సిన‌ అవసరం లేదని అన్నారు. నా కుమార్తె (సోనాక్షి) 'రామాయణం'పై ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోవడం వల్ల ఎవరికైనా సమస్య ఉందని నేను అనుకోను. ముందుగా ఈ వ్యక్తి రామాయణం సంబంధిత విష‌యాల‌లో నిపుణుడా? అత‌డి అర్హత ఏమిటి? అత‌డిని హిందూ మతానికి సంరక్షకుడిగా ఎవరు నియమించారు? అంటూ షాట్‌గ‌న్ శ‌త్రుఘ్న సూటిగా ప్ర‌శ్నించారు.

''నా ముగ్గురు పిల్లల గురించి నేను చాలా గర్వపడుతున్నాను. సోనాక్షి తనంతట తానుగా స్టార్ గా ఎదిగింది. నేను త‌న‌ కెరీర్‌ను ప్రారంభించాల్సిన అవసరం రాలేదు. ఏ తండ్రి అయినా గర్వించే కుమార్తె'' అంటూ సోనాక్షిని ఆకాశానికెత్తేశారు శ‌త్రుఘ్న‌. రామాయణంపై ప్రశ్నకు సమాధానం ఇవ్వలేక‌పోతే సోనాక్షిని మంచి హిందువు కాదు అని ప్రకటించలేరు.. త‌న‌ను అన‌ర్హురాలిని చేయ‌లేరు.. ఎవరి నుంచి సర్టిఫికేట్ అవసరం లేదు.. అని అన్నారు.

Tags:    
  • Bollywood 
  • Tollywood 
  • Filmindustry 
  • Mukeshkhanna 
  • Sonakshisinha 
  • Shatrughansinha 
  • Ramayana 

Similar News

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS