మృణాల్ కాస్త తగ్గించినట్టు ఉందే..?

ఐతే ఎలాగోలా అడివి శేష్ డెకాయిట్ ఛాన్స్ పట్టేసింది అమ్మడు. ఆ సినిమాలో ముందు శృతి హాసన్ ని హీరోయిన్ గా తీసుకోగా కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకోవాల్సి వచ్చింది.;

Update: 2025-06-13 03:00 GMT

సీతారామం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ ఆ సినిమాతో ఇక్కడ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ నెక్స్ట్ నానితో హాయ్ నాన్న తో కూడా సూపర్ హిట్ అందుకుంది. తెలుగు ఎంట్రీ ఇవ్వడం వచ్చీరాగానే రెండు సూపర్ హిట్లు కొట్టడంతో మృణాల్ కి ఇక టాలీవుడ్ లో తిరుగు లేదని అనుకున్నారు. కానీ థర్డ్ మూవీ విజయ్ దేవరకొండ తో చేసిన ది ఫ్యామిలీ స్టార్ పోవడంతోనే అమ్మడికి అవకాశాలు లేకుండా పోయాయి. స్టార్ సినిమాలు పక్కన పెడితే యువ హీరోల సినిమాల్లో కూడా మృణాల్ పేరు వినిపించలేదు.

ఐతే ఎలాగోలా అడివి శేష్ డెకాయిట్ ఛాన్స్ పట్టేసింది అమ్మడు. ఆ సినిమాలో ముందు శృతి హాసన్ ని హీరోయిన్ గా తీసుకోగా కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. ఫైనల్ గా మృణాల్ ఆ ఛాన్స్ అందుకుంది. డెకాయిట్ ఒక్కటే తెలుగులో మృణాల్ కి ఉన్న ఆఫర్. ఆ సినిమా డిసెంబర్ కి రిలీజ్ అవుతుంది. ఐతే తెలుగుతో పాటు హిందీలో వచ్చిన సినిమానల్లా చేస్తుంది మృణాల్ ఠాకూర్.

రెండు హిట్లు పడగానే తెలుగులో రెమ్యునరేషన్ పరంగా డిమాండ్ చేసిన మృణాల్ ఠాకూర్ ఇప్పుడు అవకాశాలు రావట్లేదని కాస్త పట్టు విడిపులు చేస్తుందని టాక్. ముందు సినిమా కథ నచ్చితే ఆ తర్వాత రెమ్యునరేషన్ అనేస్తుందట. మృణాల్ ఠాకూర్ అంతకుముందు కూడా పారితోషికం విషయంలో మరీ అంత పట్టుబట్టి ఉండదు. కానీ తన డిమాండ్ మేరకు ఇవ్వాలని చెప్పేదట. ఐతే ప్రస్తుతం తెలుగులో కెరీర్ స్ట్రాంగ్ చేసుకోవాల్సిన పరిస్థితి కాబట్టి అమ్మడు రెమ్యునరేషన్ గురించి పెద్దగా పట్టించుకోవట్లేదని తెలుస్తుంది.

మృణాల్ ఠాకూర్ డెకాయిట్ రిలీజ్ అయ్యే సరికి మరో ఛాన్స్ అందుకుంటే పర్లేదు. ఒకవేళ డెకాయిట్ హిట్ పడితే కచ్చితంగా అవకాశాలు వస్తాయి. ఆ సినిమా రిజల్ట్ అటు ఇటు అయితే మాత్రం మళ్లీ అమ్మడు రిస్క్ లో పడినట్టే అవుతుంది. మృణాల్ ఠాకూర్ తెలుగు కెరీర్ అడివి శేష్ డెకాయిట్ మీద ఆధారపడి ఉందని చెప్పొచ్చు. బాలీవుడ్ లో మాత్రం మృణాల్ వచ్చిన ప్రతి ఛాన్స్ వరుసగా చేసుకుంటూ వెళ్తుంది. సీనియర్ హీరోలకు కూడా పర్ఫెక్ట్ గా సూటయ్యే కటౌట్ ఉన్న మృణాల్ వాళ్ల దృష్టిలో పడనందుకు కాస్త దిగులు పడుతుందని చెప్పొచ్చు. ఐతే తర్వాత అయినా అమ్మడు టాలీవుడ్ టాప్ స్టార్ ఛాన్స్ లు అందుకుంటుందేమో చూడాలి.

Tags:    

Similar News