పిక్ టాక్ : మృణాల్ మినీ వైట్ డ్రెస్ లుక్ అదుర్స్
ఒక వైపు సౌత్‌లో సినిమాలు చేస్తూనే మరో వైపు బాలీవుడ్‌లోనూ ఈ అమ్మడు సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అమ్మడు రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేస్తుంది.;
2012లో బుల్లి తెరపై ముజ్సే కుచ్ కెహ్తీ...యే ఖామోషియాన్ సీరియల్‌తో సర్‌ప్రైజ్ చేసిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. తక్కువ సమయంలోనే బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. హిందీ సినిమా ఇండస్ట్రీలో 2018లో ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందు అంటే 2014లో హలో నందన్ తో మరాఠీ సినిమాలో నటించింది. మరాఠీలో 2014లో మూడు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత వరుసగా హిందీ సినిమాల్లో నటించింది. మరాఠీ సినిమాలో నటించిన తర్వాత దాదాపు నాలుగు ఏళ్లకు హిందీ సినిమాలో నటించే అవకాశాన్ని మృణాల్ సొంతం చేసుకుంది. బాలీవుడ్‌లో 2018 నుంచి 2021 వరకు సినిమాల్లో నటించింది. కానీ ఒక్క సినిమాతోనూ హిట్ కొట్టలేకపోయింది.
బాలీవుడ్‌లో అడపా దడపా ఆఫర్లు వచ్చినా హిట్ కొట్టక పోవడంతో కెరీర్‌లో నిలదొక్కుకోవడం కష్టమే అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఈ అమ్మడికి టాలీవుడ్ నుంచి సీతారామం సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. తెలుగులో సీతారామం సినిమా సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో టాప్ స్టార్ హీరోయిన్‌గా మారింది. తెలుగులో ఈమె వరుసగా రెండు విజయాలను సొంతం చేసుకోవడంతో ఆ తర్వాత ఈ అమ్మడు చేసిన సినిమాలు మంచి క్రేజ్ క్రియేట్ అయింది. ఒక వైపు సౌత్‌లో సినిమాలు చేస్తూనే మరో వైపు బాలీవుడ్‌లోనూ ఈ అమ్మడు సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అమ్మడు రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేస్తుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 14 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఈ అమ్మడు పలు బ్రాండ్స్‌కి అంబాసిడర్‌గా వ్యవహరించడంతో పాటు, పలు ప్రముఖ మ్యాగజైన్‌లపైనా కనిపిస్తూ వస్తుంది. తాజాగా కాస్మోపాలిటన్ ఇండియా మ్యాగజైన్ కోసం ఈ అమ్మడు కవర్ ఫోటోకు స్టిల్స్ ఇచ్చింది. వైట్ డ్రెస్‌తో విభిన్నమైన బ్యాక్‌గ్రౌండ్‌లో మృణాల్ కెమెరాకు ఫోజ్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేసింది. మినీ డ్రెస్‌లో మృణాల్ ను చూస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండాలని ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా మృణాల్ మరింత అందంగా కనిపిస్తుంది అంటూ ఆమె అభిమానులు, ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మహారాష్ట్రలోని ధూలేలో జన్మించిన మృణాల్ ఠాకూర్ వసంత్ విహార్ స్కూల్‌లో చదివింది. చదువుకునే సమయంలోనే ఈమెకి బుల్లి తెరపై కనిపించే అవకాశం దక్కింది. గ్రాడ్యుయేషన్ చేయకుండానే కాలేజ్‌ని మధ్యలో విడిచి పెట్టింది. ప్రస్తుతం తెలుగులో ఈమె అడవి శేష్‌తో కలిసి డెకాయిట్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా కోసం ఆమె ఫ్యాన్స్‌తో పాటు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈమె హిందీలో సన్నాఫ్ సర్దార్, పూజా మేరీ జాన్, హై జవానీ తో ఇష్క్ హోనా హై, తుమ్ హో తో సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో ఈమెకు మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. కానీ ప్రస్తుతం బాలీవుడ్‌పైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.