ఆధునిక ప్రపంచంలో స్వేచ్ఛగా జీవించే హక్కు లేదా?
ఇటీవల అంబానీ ఇంట్లో జరిగిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న కత్రినా కైఫ్, కొడుకు విహాన్‌కు జన్మనిచ్చిన తర్వాత కాస్త బరువు పెరగడంతో కొందరు దారుణంగా బాడీ షేమింగ్ చేశారు.
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల దుస్తులు, శారీరక మార్పులపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడం, నెటిజన్లు దారుణమైన బాడీ షేమింగ్‌కు దిగడం ఈమధ్య మరీ ఎక్కువైపోయింది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కత్రినా కైఫ్, కృతి సనన్‌లపై జరిగిన ఆన్‌లైన్ ట్రోలింగ్ పైన ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తోటి నటీమణులకు మద్దతుగా నిలుస్తూ ఆమె చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
కత్రినా, కృతి లపై అనవసర విమర్శలు:
ఇటీవల అంబానీ ఇంట్లో జరిగిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న కత్రినా కైఫ్, కొడుకు విహాన్‌కు జన్మనిచ్చిన తర్వాత కాస్త బరువు పెరగడంతో కొందరు దారుణంగా బాడీ షేమింగ్ చేశారు. మరోవైపు, ఒక జ్యూవెలరీ యాడ్‌లో కృతి సనన్ ధరించిన దుస్తులపై బికినీలా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున వివాదం సృష్టించారు. ఇక ఈ పరిణామాలపై మృణాల్ ఠాకూర్ తీవ్రంగా స్పందిస్తూ, ప్రతీ చిన్న విషయానికి ఇతరులను జడ్జ్ చేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.
జనాలకు పిచ్చి పట్టినట్లు అనిపిస్తోంది:
తన తాజా సినిమా ప్రమోషన్లలో భాగంగా మృణాల్ ట్రోలింగ్‌పై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అది వారి జీవితం, వారి వ్యక్తిగత ఇష్టం. ఇక ప్రతి ఒక్కరికీ తమ జీవితంలో వచ్చే ప్రతి దశను ఆస్వాదించే హక్కు ఉంది. ఇండస్ట్రీకి ఎంతో సేవ చేసిన ఈ ఐకానిక్ మహిళలను విమర్శించే హక్కు మనకు ఎక్కడిది? అంతర్జాతీయ స్థాయిలో మన దేశ ప్రతిష్టను పెంచిన వారి కష్టాన్ని మర్చిపోయి కామెంట్లు చేస్తుంటే జనాలకు పిచ్చి పట్టినట్లు అనిపిస్తోంది" అని మండిపడ్డారు.
పురుషుల పరిస్థితి కూడా ఇంతే:
కేవలం మహిళలనే కాకుండా ఈ రోజుల్లో పురుషులను కూడా ఇలాగే సోషల్ మీడియాలో విచక్షణారహితంగా జడ్జ్ చేస్తున్నారని మృణాల్ అభిప్రాయపడ్డారు. ఎవరికి నచ్చినట్లు వారు జీవించే స్వేచ్ఛ ఉండాలని, ఇతరుల పర్సనల్ విషయాలపై అనవసరంగా కామెంట్లు చేయకూడదని అన్నారు.. తోటి నటీమణుల పట్ల ఆమె చూపించిన ఈ ధైర్యం, పరిణతి ఇప్పుడు సినీ వర్గాల నుంచి గొప్ప ప్రశంసలు అందుకుంటోంది.
ఓటీటీలో మృణాల్ కొత్త సినిమా:
ఇక మృణాల్ ఠాకూర్ సినిమాల విషయానికి వస్తే, ఆమె నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'పూజా మేరీ జాన్' ప్రస్తుతం 'జీ5' ఓటీటీలో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. నవజ్యోత్ గులాటీ దర్శకత్వంలో దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రంలో హుమా ఖురేషీ కూడా ఒక కీలక పాత్ర పోషించారు. ఇక ఒకవైపు ఓటీటీలో వైవిధ్యమైన పాత్రతో అలరిస్తూనే, మరోవైపు తోటి నటీమణులకు అండగా నిలిచి మృణాల్ నిజమైన హీరోయిన్ అని నిరూపించుకున్నారు.
మొత్తానికి, సోషల్ మీడియాలో హద్దులు దాటుతున్న ట్రోలింగ్ సంస్కృతిపై మృణాల్ ఠాకూర్ ఇచ్చిన కౌంటర్ నెట్టింట వైరల్ అవుతోంది. సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని, వారి కష్టాన్ని మర్చిపోయి అనవసర కామెంట్లు చేయకూడదని ఆమె స్పష్టంగా చెప్పారు. మృణాల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా యూజర్లకు ఒక మంచి కంటివింపు గా నిలుస్తాయని ఆశిద్దాం.