38 ఏళ్లు తేడా.. ఓకేనా మృణాల్?
తాజాగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఒక ఇంటర్వ్యూలో అదే తరహా వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.;
యంగ్ హీరోయిన్స్, అప్‌కమింగ్ హీరోయిన్స్ సీనియర్ హీరోలతో నటించేందుకు ఒకింత వెనకడుగు వేస్తున్నారు. స్టార్ హీరోలు అయితే, కథ డిమాండ్ చేస్తే, భారీ పారితోషికం డిమాండ్ చేస్తే తప్ప సీనియర్ హీరోల సినిమాల్లో యంగ్ హీరోయిన్స్ నటించేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఇటీవల ఒక తెలుగు స్టార్ హీరోల సినిమాలో ఒక హీరోయిన్ నటించేందుకు గాను ముందు నో చెప్పిందని, కానీ భారీ పారితోషికం ఆఫర్ చేయడంతో ఓకే చెప్పిందనే పుకార్లు షికార్లు చేశాయి. కానీ కొందరు హీరోయిన్స్ మాత్రం ఎంత స్టార్‌డం ఉన్నా కొందరు సీనియర్ హీరోలతో నటించాలని కోరుకుంటూ ఉంటారు. తమ అభిమాన హీరోలు వారు అని, వారితో ఒక్క సినిమా చేసే అవకాశం వచ్చినా చాలని అంటూ ఉంటారు.
తాజాగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఒక ఇంటర్వ్యూలో అదే తరహా వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచి కమల్ సర్ అంటే చాలా అభిమానం, ఆయన సినిమాలు చాలా చూశాను, చాలా కాలం నుంచి ఆయనతో నటించాలని ఉంది. ఆయన సినిమాలో చిన్న పాత్ర లభించినా చాలు అన్నట్లుగా మృణాల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోలు వయసుతో సంబంధం లేకుండా హీరోయిన్స్‌తో రొమాన్స్ చేస్తున్నారు. ఇటీవల కమల్ హాసన్ థగ్ లైఫ్ లో చేసిన రొమాన్స్ వివాదాస్పదం అయింది. మీ వయసులో కనీసం సగం కూడా లేని అమ్మాయితో ఇలా రొమాన్స్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు ప్రశ్నించారు.
ఇదే తరహా ప్రశ్న బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్‌కి సైతం ఎదురు అయింది. కూతురు వయసు ఉన్న అమ్మాయిని మీ సినిమాలో హీరోయిన్‌గా ఎలా నటింపజేస్తారు అంటూ ప్రశ్నించిన వారు చాలా మంది ఉన్నారు. దాని ఆయన స్పందించారు కూడా.. ఏఐ టెక్నాలజీతో తన వయసు తగ్గించారు అన్నట్లుగా చమత్కరించాడు. మొత్తానికి సీనియర్ హీరోలకు హీరోయిన్స్ పెద్ద సమస్యగా ఉన్న సమయంలో మృణాల్ ఠాకూర్ అలా మాట్లాడటం చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం కమల్ ఒక భారీ యాక్షన్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఆ సినిమాలో మృణాల్ ఠాకూర్ ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని, సీనియర్ హీరోలకు హీరోయిన్స్ లోటు ఉన్న సమయంలో మృణాల్ వంటి స్టార్ హీరోయిన్స్ ఇచ్చిన ఆఫర్‌ను ఏ దర్శకుడు వదిలి పెట్టడు.
మృణాల్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కమల్ హాసన్ మీ కంటే 38 ఏళ్లు పెద్ద వాడు అనే విషయం మీకు తెలుసు... వయసు తేడా అంతగా ఉందని మీకు తెలిసి కూడా ఆయనతో వర్క్ చేయాలని అనుకుంటున్నారా అంటూ కొందరు నెటిజన్స్ మృణాల్ ఠాకూర్‌ను ప్రశ్నిస్తున్నారు. మృణాల్ అన్ని విషయాలు తెలిసే కమల్ తో నటించాలని కోరుకుంటూ ఉంటుందని, అభిమానం అనేది వయసును చూడదని, ఆమెకు కమల్ పై ఉన్న అభిమానంతో ఒక్క సీన్‌లో నటించినా చాలు అని వెయిట్ చేస్తుందని, అంతకు మించి వయసు తేడా ఉన్న వారు కూడా జోడీగా నటించిన సందర్భాలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి. ఇప్పుడు మృణాల్‌ను తప్పుబట్టడానికి ఏమీ లేదని కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.