మృణాల్ బ్యాడ్ టైం మరీ ఇంతలానా..?

బాలీవుడ్, టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న మృణాల్ ఠాకూర్ కి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పొచ్చు.;

Update: 2025-08-14 06:45 GMT

బాలీవుడ్, టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న మృణాల్ ఠాకూర్ కి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పొచ్చు. తెలుగులో సీతారామం హిట్ తో అదరగొట్టిన అమ్మడు హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం డెకాయిట్ సినిమా చేస్తుంది మృణాల్. ఓ పక్క బాలీవుడ్ లో స్టార్ క్రేజ్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈమధ్యనే సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మృణాల్ ఠాకూర్.

మృణాల్ ఠాకూర్ ఓల్డ్ వీడియో..

ఐతే ఈ సినిమా ఆశించిన రేంజ్ లో ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ తెచ్చుకోలేదు. ఇది చాలదు అన్నట్టుగా మృణాల్ ఠాకూర్ ఓల్డ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె కుంకుమ భాగ్య సీరియల్ టైం లో తన కో యాక్టర్ అర్జిత్ తనేజాతో మృణాల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అతను ఫిజల్లీ ఫిట్ కాబట్టి బిపాసా బసు అంటే ఇష్టమని అంటాడు. ఐతే వెళ్లి ఆమెనే పెళ్లి చేసుకో.. ఆమె కన్నా నేనే బాగుంటా అన్న విధంగా మృణాల్ ఠాకూర్ మాట్లాడింది.

ఐతే అది ఆ సీరియల్ టైం లో ఏదో క్యాజువల్ గా ఆమె అన్నది. దానికి అప్పటి వీడియోని ఇప్పుడు ట్రెండ్ చేస్తూ మృణాల్ మీద ఎటాక్ చేస్తున్నారు నెటిజెన్లు. సౌత్ లో కాస్త క్రేజ్ రాగానే ఆమె సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదని అంటున్నారు. ఐతే ఈ విషయంలో మృణాల్ ఠాకూర్ ఎలా స్పందించినా కూడా విషయం పెద్దదిగా మారే ఛాన్స్ ఉంటుంది.

మృణాల్ టాలీవుడ్ ఆఫర్లు..

అసలే కెరీర్ లో ఫ్లాపులతో కన్ ఫ్యూజన్ లో ఉన్న మృణాల్ కి మళ్లీ ఈ కొత్త హెడేక్ వచ్చి పడింది. మృణాల్ ఎప్పుడో కెరీర్ స్టార్టింగ్ లో చేసిన కామెంట్స్ ని ఇప్పుడు వైరల్ చేస్తూ ఆమెను టార్గెట్ చేస్తున్నారు బిపాసా ఫ్యాన్స్. ఐతే ఈ మొత్తం విషయం చూస్తుంటే మృణాల్ బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పడంలో సందేహం లేదు.

తెలుగులో డెకాయిట్ తప్ప మరో సినిమా లేదు. కాస్త కూస్తో క్రేజ్ ఉన్న టాలీవుడ్ లోనే అమ్మడికి పెద్దగా ఆఫర్లు రావట్లేదు. బాలీవుడ్ లో అమ్మడు చేస్తున్న సినిమాలేవి ఆకట్టుకోవట్లేదు. అందుకే తనకు పాపులారిటీ ఉన్న తెలుగులోనే ప్రయత్నాలు చేయాలని చూస్తుంది అమ్మడు. తెలుగులో మరో హిట్ పడితే మాత్రం మృణాల్ ఠాకూర్ మళ్లీ ఇక్కడ హడావిడి చేసే ఛాన్స్ ఉంటుంది.

Tags:    

Similar News