• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మిస్టర్ బచ్చన్‌లో...

మిస్టర్ బచ్చన్‌లో అక్కినేని రిఫరెన్స్‌

| విడుదలకు ముందు చేసిన భారీ ప్రచారంతో అన్ని వర్గాల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంతో పాటు ఆసక్తిని పెంచారు.

By - Tupaki Desk
Update: 2024-08-15 12:30 GMT

రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ బచ్చన్‌ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో రవితేజకు జోడీగా భాగ్య శ్రీ నటించింది. బాలీవుడ్‌ హిట్ మూవీ రైడ్‌ కి అధికారిక రీమేక్ గా రూపొందిన మిస్టర్‌ బచ్చన్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ రాజా ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా కోసం చాలా ఆసక్తిని కనబర్చారు. విడుదలకు ముందు చేసిన భారీ ప్రచారంతో అన్ని వర్గాల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంతో పాటు ఆసక్తిని పెంచారు.

నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో ఒక సన్నివేశంలో భాగంగా అక్కినేని నాగేశ్వరరావు డాన్స్ మూమెంట్‌ ను రవితేజ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఒక సన్నివేశంలో భాగంగా అన్నపూర్ణమ్మ డాన్స్ చేయమని రవితేజ ను అడగడం, అప్పుడు రవితేజ అక్కినేని వారి క్లాసికల్‌ సాంగ్స్ లో కొన్ని సాంగ్స్ కి డాన్స్ మూమెంట్స్ చేశాడు. ఏ హీరో అయినా ఇతర హీరో కి చెందిన సిగ్నేచర్‌ స్టెప్స్‌ ను చేస్తే కచ్చితంగా ఆ స్టెప్స్ వైరల్‌ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఈ సినిమాలోని ఆ బిగ్‌ సాంగ్‌ స్టెప్స్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

సోషల్‌ మీడియాలో ముందు ముందు అప్పుడే రవితేజ చేసిన ఆ స్టెప్స్ వైరల్‌ అవుతూనే ఉన్నాయి. రవితేజ గతంలో మాదిరిగా వరుసగా సినిమాలు చేయడం, అందులో ఇలాంటి మెరుపులు మెరిపించడం వంటివి చేస్తూ ఉంటే ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సక్సెస్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే మరో రెండు సినిమాలకు ఓకే చెప్పాడు. అందులో ఒకటి షూటింగ్‌ ప్రారంభం కాగా, మరోటి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుంది. ఆ సినిమారి అనుదీప్ దర్శకత్వం వహించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి.

ఇక మిస్టర్ బచ్చన్‌ సినిమాల విషయానికి వస్తే పవన్‌ కళ్యాణ్ తో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. కానీ పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల ఆ సినిమా మధ్య లో ఉంది. ఈ గ్యాప్ లో రవితేజ తో రైడ్ రీమేక్ ను స్పీడ్ గా చేశాడు. త్వరలోనే పవన్‌ కళ్యాణ్ సినిమాను పునః ప్రారంభించాలని ఫ్యాన్స్‌ తో పాటు ఆయన కూడా కోరుకుంటున్నారు. త్వరలోనే సినిమా ప్రకటన ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఉస్తాద్‌ భగత్ సింగ్ లో పవన్ చేత పవర్‌ ఫుల్ డైలాగ్స్ ను హరీష్ చెప్పించబోతున్నాడని సమాచారం అందుతోంది.

Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • MrBachchan 
  • Raviteja 
  • BhagyashreeBorse 
  • Harishshankar 
  • AkkineniNagarjuna 
  • Song 
  • Dance 
  • Socialmedia 
  • UstaadBhagatSingh 

Similar News

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

Copyright @2026

Powered by Blink CMS