విలన్ సరోజ్ తో గొడవలపై డైరెక్టర్ క్లారిటీ.. అందుకే రూమర్స్ వచ్చాయంటూ!

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ డైరెక్టర్ సందీప్ రాజ్ తాజాగా సుమా తనయుడు రోషన్ కనకాలతో మోగ్లీ సినిమా తెరకెత్తిస్తున్నారు.;

Update: 2025-10-24 17:30 GMT

ఒక సినిమా షూటింగ్ జరిగేటప్పుడు.. టెక్నీషియన్స్ మధ్య లేదా డైరెక్టర్ - నిర్మాత మధ్య లేదా హీరో - డైరెక్టర్ మధ్య విభేదాలు రావడం సహజమే. అయితే ఒక్కోసారి ఆ విభేదాలు రాకపోయినా విభేదాలు వచ్చినట్లు కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక సినిమాలో విలన్ గా నటిస్తున్న సెలబ్రిటీతో అదే చిత్రాన్ని నిర్మిస్తున్న డైరెక్టర్ కి మధ్య విభేదాలు వచ్చాయి అంటూ వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో తాజాగా ఆ చిత్ర డైరెక్టర్ స్పందిస్తూ రూమర్స్ కి చెక్ పెట్టారు.

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ డైరెక్టర్ సందీప్ రాజ్ తాజాగా సుమా తనయుడు రోషన్ కనకాలతో మోగ్లీ సినిమా తెరకెత్తిస్తున్నారు. రోషన్ కనకాలకి ఇది రెండవ చిత్రం కావడం గమనార్హం. ఇదే సినిమాలో పబ్లిక్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న బండి సరోజ్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో సందీప్ - సరోజ్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సులు వచ్చాయనే వార్తలు వినిపించడంతో సందీప్ క్లారిటీ ఇస్తూ.. సరోజ్ కి - నాకు మధ్య విభేదాలు వచ్చాయనే వార్తలు నా వరకు చేరాయి. అందుకే ఈరోజు నేను స్పందించక తప్పడం లేదు అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

సందీప్ మాట్లాడుతూ.." మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అనడానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు నేను పని చేసిన సుహాస్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. సెట్ లో మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ స్నేహం ఇంకోలా ఉండేది. ఇప్పుడు రోషన్ తో నేను రెండేళ్లుగా ప్రయాణం చేస్తున్నాను. తాను కూడా నాకు మంచి స్నేహితుడు అయ్యాడు. ఇక సరోజ్ అంటారా.. ఆయన నాకంటే సీనియర్ ఎన్నో సినిమాలు చేసిన అనుభవం ఆయనకు ఉంది. అయితే ఆయనతో ఉండే బాండింగ్ వేరు. అంతేకానీ మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఆయన చాలా అనుభవంతో ఏదైనా చెబితే నేను కచ్చితంగా వింటాను. పైగా మా మధ్య క్రియేటివ్ ఫ్రీడం కూడా ఉంది. చాలాసార్లు నేను అనుకున్నది ఆయనే చేసి చూపిస్తాను. ఏది బెటర్ గా ఉంటే అది తీసుకోమని నాకు సలహా ఇస్తారు. చాలా ఫ్రెండ్లీగా ఉండే వ్యక్తిత్వం ఆయనది.. అలాంటి వ్యక్తితో నాకెందుకు మనస్పర్ధలు వస్తాయి. దయచేసి మా మధ్య లేనిపోని రూమర్స్ క్రియేట్ చేయకండి అంటూ డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి అయితే బండి సరోజ్ తో డైరెక్టర్ సందీప్ కి గొడవలు అంటూ వచ్చిన వార్తలకు ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్.

బండి సంజయ్ విషయానికి వస్తే.. పబ్లిక్ స్టార్ గా పేరు సంగం చేసుకున్న బండి సరోజ్ కుమార్ గతంలో నిర్బంధం, సూర్యాస్తమయం, మాంగల్యం వంటి చిత్రాలలో నటించారు. హీరోగా, దర్శకుడిగా ఈ చిత్రాలను తెరకెక్కించిన ఈయన ఇటీవల పరాక్రమం అనే సినిమాతో కూడా మెప్పించాడు. అలాగే రెండు తమిళ్ చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. అలాంటి ఈయన ఇప్పుడు రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న మోగ్లీ సినిమాలో నోలన్ అనే విలన్ పాత్ర పోషిస్తున్నారు.

Tags:    

Similar News