సూపర్ స్టార్‌ మూవీ సూపర్ అప్‌డేట్‌

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్ లాల్‌ వయసుతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు.;

Update: 2025-09-16 10:27 GMT

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్ లాల్‌ వయసుతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు. ఆయన చేసే సినిమాలు సాదా సీదా సినిమాలు ఏమీ కావు. ఆయన యంగ్‌ హీరోలు సైతం చేసేందుకు భయపడే అత్యంత కఠినమైన సబ్జెక్ట్‌లను ఎంపిక చేస్తున్నాడు. తన ప్రతి సినిమా దేనికి అదే అన్నట్లుగా భిన్నంగా ఉండే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే ఎల్‌ 2 : ఎంపురన్‌, తుడారుమ్‌, కన్నప్ప, హృదయపూర్వం సినిమాలతో వచ్చిన మోహన్‌ లాల్‌ ఈ దీపావళికి వృషభ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నంద కిషోర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మోహన్‌ లాల్‌ పాత్ర నభూతో అన్నట్లుగా ఉండబోతుంది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమోషన్‌ హడావిడి మొదలు పెట్టబోతున్నారు.


మోహన్‌ లాల్‌ వృషభ టీజర్‌ అప్‌డేట్‌

పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతున్న వృషభ సినిమా టీజర్‌ను సెప్టెంబర్‌ 18న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. మోహన్‌ లాల్‌ గత చిత్రాల ఫలితం నేపథ్యంలో ఈ సినిమా సైతం తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. సెప్టెంబర్‌ 18న రాబోతున్న టీజర్‌తో సినిమా స్థాయి అమాంతం పెరగడం ఖాయం అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. హీరోగా మరో సూపర్‌ హిట్‌ను మోహన్ లాల్‌ తన ఖాతాలో వేసుకోవడం ద్వారా యంగ్‌ హీరోలకు మరింత పోటీగా నిలుస్తాడు అంటూ ఆయన అభిమానులు ధీమాగా ఉన్నారు. ఈ ఎపిక్‌ యాక్షన్‌ డ్రామా సినిమాను వెండి తెరపై చూసేందుకు గాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని అభిమానులతో పాటు, పాన్ ఇండియా రేంజ్‌లో ఉన్న ప్రేక్షకులు సోషల్‌ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.

రాగిణి ద్వివేది ముఖ్య పాత్రలో వృషభ

నంద కిషోర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మోహన్‌ లాల్‌ ప్రధాన పాత్రలో నటించగా, సమర్జిత్‌ లంకేష్‌, షానయ కపూర్, జహ్రా ఎస్. ఖాన్ , శ్రీకాంత్, రాగిణి ద్వివేది తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. సినిమాలో ప్రతి పాత్ర కథకు అత్యంత కీలకం అన్నట్లుగా ఉంటుంది అంటూ ఒక మలయాళ మీడియా సంస్థ ఈ సినిమాకు సంబంధించిన కథనంలో పేర్కొంది. మోహన్‌ లాల్‌ ఇలాంటి పాత్రలు గతంలో చేయలేదు కనుక అభిమానులు కొత్తగా ఫీల్‌ అవుతారు అంటూ ఆ కథనంలో పేర్కొన్నారు. తప్పకుండా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, కలెక్షన్స్‌ విషయంలో మోహన్‌ లాల్‌ మరోసారి తన సత్తా చాటడం ఖాయం అనే నమ్మకం ను వ్యక్తం చేస్తున్నారు. మోహన్‌ లాల్‌ ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నారు అనేది ఇప్పటికే రివీల్‌ అయిన విషయం తెల్సిందే.

పాన్‌ ఇండియా రేంజ్‌లో దీపావళి కానుకగా వృషభ రిలీజ్‌

ఈ సినిమాను బాలాజీ మోషన్ పిక్చర్స్‌, కన్నెక్ట్‌ మీడియా, ఏవీఎస్‌ స్టూడియోస్‌ బ్యానర్‌లపై శోభా కపూర్‌, ఏక్తా కపూర్‌, సీకే పద్మ కుమార్‌, వరుణ్‌ మాథుర్‌, సౌరభ్‌ మిశ్రా, అభిషేక్‌ వ్యాస్‌, విశాల్‌ గుర్నాని, జూహి పరేఖ్‌ మెహతాలు సంయుక్తంగా నిర్మించారు. మలయాళంతో పాటు తెలుగు, హిందీ ఇతర సౌత్‌ ఇండియన్‌ భాషల్లో విడుదల చేయబోతున్నారు. మోహన్‌ లాల్‌, మేకా శ్రీకాంత్‌ కాంబోలో సుదీర్ఘ కాలం తర్వాత ఈ సినిమా రాబోతుండటం విశేషం. ఈ ఏడాది మే 21న మోహన్‌ లాల్‌ బర్త్‌డే సందర్భంగా విడుదలైన ఫస్ట్‌ లుక్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా మోహన్‌ లాల్‌ ఉగ్ర రూపంతో ఉండటంతో కథపై ఆసక్తి కలిగింది. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు పెద్ద వసూళ్లు సాధిస్తున్నాయి, ముఖ్యంగా మలయాళ సినిమాలు తమ సత్తా చాటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వృషభ సినిమా సైతం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందనే విశ్వాసంను మోహన్‌ లాల్‌ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News