సినిమా కాదు.. 'ఆపరేషన్ గంగా'తో ప్లాన్ అదేలా ఉందే..

మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్‌ లాల్‌ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ఆపరేషన్ గంగా. నేషనల్ అవార్డు విన్నర్ విష్ణు మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ మూవీ అనౌన్స్‌మెంట్‌తోనే ఆసక్తి పెంచుతోంది.

Update: 2026-09-06 04:38 GMT

మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్‌ లాల్‌ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ఆపరేషన్ గంగా. నేషనల్ అవార్డు విన్నర్ విష్ణు మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ మూవీ అనౌన్స్‌మెంట్‌తోనే ఆసక్తి పెంచుతోంది. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన టైటిల్, కాస్టింగ్, మేకింగ్ స్కేల్‌పై చర్చ జరుగుతోంది. చూస్తుంటే మేకర్స్‌ ది కేవలం ఓ సినిమా తీయాలనే ఆలోచన కాదేమో.. దాని పరిధిని మరింత పెంచే ప్లాన్ ఉన్నట్టే కనిపిస్తోంది.

ఆపరేషన్ గంగా అనే టైటిల్‌ సినిమాకు మొదటి నుంచే ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఇండియన్స్ ను స్వదేశానికి తీసుకొచ్చిన రెస్క్యూ మిషన్‌ నేపథ్యంలో రూపొందుతోంది. దీంతో టైటిల్‌ వినగానే కథపై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలవుతోంది. సాధారణ టైటిల్‌ లా కాకుండా.. ఒక భారీ ఘటనను గుర్తు చేసే పేరును ఎంచుకోవడం కూడా సినిమాకు ముందుగానే బజ్‌ తీసుకొచ్చే అంశంగా మారింది.

ఇక ఆ సినిమాకు మోహన్‌ లాల్‌ లాంటి సూపర్‌ స్టార్‌ హీరో కావడం మరో పెద్ద ప్లస్‌. మలయాళంలో ఆయనకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆపరేషన్ గంగాతో ఆయన ఇమేజ్‌ ను మరింత తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. సినిమా కథకు ఉన్న నేషనల్ స్కోప్‌ కు మోహన్‌ లాల్‌ స్టార్‌ డమ్‌ తోడైతే.. ఇతర భాషల్లోనూ సినిమాపై ఆసక్తి పెరగడం ఖాయం. కాస్టింగ్‌ కూడా ఇదే విషయాన్ని సూచిస్తోంది.

మోహన్‌ లాల్‌ తో పాటు బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌, ఆదిల్ హుస్సేన్‌, కోలీవుడ్ సీనియర్ యాక్టర్ పార్తీబన్‌, భాగ్యశ్రీ బోర్సే వంటి నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంటే ఒక్క మలయాళ మార్కెట్‌ ను దృష్టిలో పెట్టుకుని కాకుండా.. వివిధ భాషల ప్రేక్షకులను ఆకట్టుకునేలా టీమ్‌ను సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది. మేకింగ్ విషయంలోనూ ఆపరేషన్ గంగా చిన్నగా కనిపించడం లేదు.

జార్జియా, పోలాండ్‌, కజకిస్థాన్‌ వంటి దేశాలతో పాటు భారత్‌ లోని పలు ప్రాంతాల్లో షూటింగ్‌ జరగనుంది. దాదాపు 180 రోజుల పాటు షూటింగ్ ప్లాన్‌ చేసినట్లు సమాచారం. ఇంత భారీ షెడ్యూల్‌ పెట్టడం చూస్తే సినిమా స్కేల్‌ పై మేకర్స్ ఎంత ఫోకస్ పెట్టారో అర్థమవుతోంది. ఇక దర్శకుడు విష్ణు మోహన్‌ కు ఇది రెండో సినిమా. తొలి చిత్రం మెప్పడియాన్‌ తో జాతీయ అవార్డు అందుకున్న ఆయన.. ఇప్పుడు మోహన్‌లాల్‌ తో భారీ ప్రాజెక్ట్‌ చేస్తున్నారు.

చిన్న కథతో మొదలైన దర్శకుడి ప్రయాణం.. ఇప్పుడు ఇంటర్నేషనల్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాకు చేరుకోవడం కూడా ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఆపరేషన్ గంగా విషయంలో మేకర్స్‌ ప్లాన్ కేవలం ఓ సినిమాకు పరిమితం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవర్‌ ఫుల్ టైటిల్‌, మోహన్‌ లాల్‌ స్టార్‌ డమ్‌, పాన్‌ ఇండియా కాస్టింగ్‌, భారీ మేకింగ్‌.. అన్నింటినీ కలిపి సినిమాను పెద్ద స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కనిపిస్తోంది. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

Tags:    

Similar News