ప్ర‌మోష‌న్స్ విష‌యంలో మోహ‌న్ లాల్ రూటే స‌ప‌రేటు

మ‌ల‌యాళంలో మోహ‌న్ లాల్ కు ఉన్న ఫాలోయింగ్ నెక్ట్స్ లెవెల్ అని అంద‌రికీ తెలుసు. ఆయ‌న ఫాలోయింగ్, క్రేజ్ ఈ మ‌ధ్య మ‌రీ విప‌రీతంగా పెరిగాయి.;

Update: 2025-05-05 00:30 GMT

మ‌ల‌యాళంలో మోహ‌న్ లాల్ కు ఉన్న ఫాలోయింగ్ నెక్ట్స్ లెవెల్ అని అంద‌రికీ తెలుసు. ఆయ‌న ఫాలోయింగ్, క్రేజ్ ఈ మ‌ధ్య మ‌రీ విప‌రీతంగా పెరిగాయి. దానికి త‌గ్గ‌ట్టే ఎప్ప‌టిక‌ప్పుడు ఆయ‌న త‌న మార్కెట్ ను కూడా విస్త‌రించుకుంటూ మ‌ల‌యాళ బాక్సాఫీస్ వ‌ద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ స‌త్తా చాటుతున్నారు.

మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో క‌లెక్ష‌న్ల ప‌రంగా ఎక్కువ రికార్డులు ఆయ‌న పేరు మీదే ఉన్నాయి. దృశ్యం సినిమాతో మాలీవుడ్ కు మొద‌టి రూ.50 కోట్ల సినిమాను అందించిన మోహ‌న్ లాల్, పులి మురుగ‌న్ తో రూ. మొద‌టి 100 కోట్ల సినిమాను ఇచ్చారు. ఆ త‌ర్వాత రీసెంట్ గా ఎల్‌2: ఎంపురాన్ తో ఏకంగా మొద‌టి రూ. 300 కోట్ల సినిమాను అందించి రికార్డు సృష్టించారు. నెల రోజుల గ్యాప్ లో రెండుసార్లు రూ.100 కోట్లు అందుకున్న మొద‌టి ఇండియ‌న్ హీరోగా కూడా మోహ‌న్ లాల్ నిలిచారు.

మార్చిలో ఎంపురాన్ సినిమాతో రూ.300 కోట్లు క‌లెక్ట్ చేసిన మోహ‌న్ లాల్, మ‌రో నెల రోజుల్లోపే తుడ‌రుమ్ అనే సినిమాను రిలీజ్ చేసి ఆ సినిమాను బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ దిశ‌గా తీసుకెళ్తున్నారు. ప్ర‌స్తుతం ఆ మూవీ రూ.150 కోట్ల మార్క్ దిశ‌గా దూసుకెళ్తుంది. ఈ రెండు సినిమాల ప్ర‌మోష‌న్స్ విష‌యంలో మోహ‌న్ లాల్, అత‌ని టీమ్ ఫాలో అయిన స్ట్రాట‌జీ మాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

లూసిఫ‌ర్ సీక్వెల్ కావ‌డం మ‌రియు ఆ సినిమాకు భారీ బ‌డ్జెట్ పెట్ట‌డంతో ఆల్రెడీ ఎంపురాన్ పై మంచి హైప్ ఉంది. దాన్ని ఇంకాస్త పెంచ‌డానికి మోహ‌న్ లాల్ సినిమాను తెగ ప్ర‌మోట్ చేశారు. మిక్డ్స్ టాక్ తో రిలీజైన ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ వ‌ల్ల భారీ ఓపెనింగ్స్ ను క‌లెక్ట్ చేసి సుల‌భంగా బ్రేక్ ఈవెన్ అయింది. ఎంపురాన్ ఫుల్ ర‌న్ క్లోజ్ అయ్యే టైమ్ కు తుడ‌రుమ్ ను రిలీజ్ చేశారు.

అయితే తుడ‌రుమ్ కు ప్ర‌మోష‌న్స్ పెద్ద‌గా చేయ‌లేదు. కానీ ఆ సినిమాలో కంటెంట్ ఉండ‌టంతో సినిమాకు మంచి వ‌సూళ్లు వ‌స్తున్నాయి. అస‌లు ఏ మాత్రం అంచ‌నాల్లేకుండా వ‌చ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము లేపుతుంది. బ‌ల‌హీనంగా ఉన్న ఎంపురాన్ కు ప్ర‌మోష‌న్స్ తో బాగా హైప్ తీసుకొచ్చిన మోహ‌న్ లాల్, తుడ‌రుమ్ విష‌యంలో కంటెంట్ ను న‌మ్ముకుని ప్ర‌మోష‌న్స్ ను లైట్ తీసుకుని ఆ సినిమాను కూడా మంచి హిట్ గా నిలిపారు. ఇలా డిఫ‌రెంట్ స్ట్రాట‌జీని ఫాలో అవ‌డం కూడా ఒక ఆర్ట్ అని అంద‌రూ మోహ‌న్ లాల్ ను ప్రశంసిస్తున్నారు.

Tags:    

Similar News