50 ఏళ్ల ప్రయాణం.. మోహన్ బాబు గ్రాండ్ పార్టీ!

మోహన్ బాబు స్టైల్, డైలాగ్ డెలివరీకి దశాబ్దాలుగా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 600కు పైగా సినిమాల్లో నటించడం, క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్‌గా నిలవడం ఆయనకే చెల్లింది.;

Update: 2025-11-17 16:08 GMT

ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం అంటే మాటలు కాదు. అది చాలా పెద్ద మైల్‌స్టోన్. కలెక్షన్ కింగ్, పద్మశ్రీ మోహన్ బాబు ఆ అరుదైన ఫీట్‌ను రీచ్ అయ్యారు. నటుడిగా, నిర్మాతగా హాఫ్ సెంచరీ కొట్టిన ఈ హ్యాపీ మూమెంట్‌లో, ఆయన తన ఆనందాన్ని ఇండస్ట్రీ ఫ్యామిలీతో పంచుకున్నారు.





ఈ సెలబ్రేషన్స్‌లో భాగంగా, మోహన్ బాబు ఆదివారం ఒక గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఇది కేవలం మీడియా వాళ్లకే కాదు, 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' (MAA) సభ్యులు, పలువురు నటీనటులు, మోహన్ బాబుతో అనుబంధం ఉన్న ఇండస్ట్రీ పెద్దలు కూడా ఈ పార్టీకి హాజరయ్యారు. ఇది అందరినీ కలుపుకొని చేసుకున్న ఒక స్పెషల్ గెట్ టుగెదర్‌లా సాగింది.




 


వచ్చిన వాళ్లందరినీ మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు ఎంతో బాగా చూసుకున్నారు. ఈ 50 ఏళ్ల జర్నీలో సపోర్ట్‌గా నిలిచిన వారందరికీ థాంక్స్ చెప్పేందుకే ఈ స్పెషల్ ట్రీట్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ పార్టీకి వచ్చిన 'మా' నటులు, జర్నలిస్టు మిత్రులు మోహన్ బాబును సత్కరించి, ఆయనకు స్పెషల్‌గా విషెస్ తెలిపారు.

మోహన్ బాబు స్టైల్, డైలాగ్ డెలివరీకి దశాబ్దాలుగా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 600కు పైగా సినిమాల్లో నటించడం, క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్‌గా నిలవడం ఆయనకే చెల్లింది. కేవలం యాక్టింగ్ మాత్రమే కాదు, ప్రొడక్షన్, ఎడ్యుకేషన్ ఫీల్డ్స్‌లో కూడా ఆయన తన మార్క్ క్రియేట్ చేశారు.

అయితే, ఈ పార్టీ కేవలం ట్రైలర్ మాత్రమేనట. అసలు సిసలైన పండగ నవంబర్ 22న ఉండబోతోందని టాక్. "MB50 ఎ పెర్ల్ వైట్ ట్రిబ్యూట్" పేరుతో ఒక మెగా ఈవెంట్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ బాధ్యతలను ఆయన కుమారుడు, యాక్టర్ ప్రొడ్యూసర్ విష్ణు మంచు దగ్గరుండి చూసుకుంటున్నారు.

ఈ "పెర్ల్ వైట్ ట్రిబ్యూట్" ఈవెంట్‌కు టాలీవుడ్ నుంచే కాకుండా, ఇండియాలోని అన్ని ఇండస్ట్రీల నుంచి పెద్ద పెద్ద స్టార్లు రాబోతున్నారని తెలుస్తోంది. 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఒక లెజెండరీ యాక్టర్‌కు ఇది పర్ఫెక్ట్ ట్రిబ్యూట్‌గా, చాలా గ్రాండ్‌గా ఈ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇక ప్రస్తుతం మోహన్ బాబు నాని ది ప్యారడైజ్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.

Tags:    

Similar News