మిరాయ్ కి మంచి బేరం..?
చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా మారిన తేజ సజ్జ ప్రతి సినిమా విషయంలో సంథింగ్ స్పెషల్ అనిపించేలా చేస్తున్నాడు.;
చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా మారిన తేజ సజ్జ ప్రతి సినిమా విషయంలో సంథింగ్ స్పెషల్ అనిపించేలా చేస్తున్నాడు. హనుమాన్ తో పాన్ ఇండియా హిట్ అందుకున్న తేజ సజ్జ ఆ నెక్స్ట్ సినిమాలను కూడా అదే తరహాలో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇక కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో మిరాయ్ అంటూ ఒక క్రేజీ సినిమా చేస్తున్నాడు తేజా సజ్జ. రవితేజతో చేసిన ఈగల్ సినిమా వర్క్ అవుట్ కాలేదు. అందుకే మిరాయ్ తో తన సత్తా చాటాలని చూస్తున్నాడు కార్తీక్ ఘట్టమనేని.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో తేజ సజ్జని మంచు మనోజ్ ఢీ కొడుతున్నాడు. సినిమా స్టోరీ ఏంటన్నది టీజర్ లో హింట్ ఇచ్చి అంచనాలు పెంచారు మేకర్స్. మిరాయ్ టీజర్ తోనే బజ్ ఏర్పడింది. అదే భారీ బిజినెస్ గా కూడా కన్వర్ట్ అయ్యింది. ఆల్రెడీ హనుమాన్ సక్సెస్ అవ్వడంతో తేజా సినిమా అంటే చాలు బిజినెస్ ఆటోమెటిక్ గా జరుగుతుంది.
ఈ క్రమంలో మిరాయ్ సినిమాకు నాన్ థియేట్రికల్ రైట్స్ భారీగా జరుగుతున్నాయట. సినిమాను జియో హాట్ స్టార్ కొనేయగా.. అందుకు 55 కోట్ల దాకా డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. మిరాయ్ సినిమా బిజినెస్ చూస్తుంటే ఈ సినిమా మరో హనుమాన్ లేదా దానికి మించి అనిపించేలా ఉంది.
తేజా సజ్జ, మంచు మనోజ్ ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలెట్ అవుతాయని అంటున్నారు. సినిమాలో బ్యాడ్ బాయ్ గా మనోజ్ తన మార్క్ నటనతో ఆకట్టుకుంటాడని తెలుస్తుంది. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయట. అసలైతే సినిమాను ముందే రిలీజ్ చేయాలని అనుకోగా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ లేట్ అవ్వడం వల్లే సెప్టెంబర్ 5కి వాయిదా వేశారు.
ఐతే సినిమా ఇంకా కొంత పార్ట్ చేయాల్సి ఉందట. చూస్తే ఇంకా 50 రోజులు మాత్రమే ఉంది. ఒకవేళ సినిమా అనుకున్న విధంగా రాకఓతే మిరాయ్ ను సెప్టెంబర్ నుంచి డిసెంబర్ కి వాయిదా వేస్తారని తెలుస్తుంది. తేజ సజ్జ మిరాయ్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమాలో అతను ఒక యోధుడిగా కనిపిస్తున్నాడు. టీజర్ లోని విజువల్స్ అయితే ఆడియన్స్ కి థ్రిల్ కలిగేలా చేశాయి. ఇక సినిమా ఏమేరకు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది అన్నది చూడాలి.