అమ్మ వంటే బెస్ట్.. కానీ! రానా భార్య మిహీక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
వ్యాపార కుటుంబానికి చెందిన మిహీక ఓ ఎంటర్‌ప్రెన్యూర్. ఆమె డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో అనే ఈవెంట్ మేనేజ్‌మెంట్ మరియు డెకర్ సంస్థను నిర్వహిస్తూ, ఈవెంట్ మేనేజ్‌మెంట్ లో మంచి గుర్తింపు సంపాదించారు.;
స్టార్ హీరోల వ్యక్తిగత జీవితాలపై ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా వారి ఫ్యామిలీ లైఫ్, రోజువారీ అలవాట్లు, ఇంటి సంస్కృతి వంటి విషయాలు బయటకు వచ్చినప్పుడు అవి వెంటనే హాట్ టాపిక్‌గా మారుతాయి. ఈ నేపథ్యంలో హీరో దగ్గుబాటి రానా భార్య మిహీక బజాజ్ గురించి వెలుగులోకి వచ్చిన తాజా సమాచారం ఆసక్తికరంగా మారింది. పెళ్లి తర్వాత ఆమె జీవనశైలి, ముఖ్యంగా వంట విషయంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎంటర్‌ప్రెన్యూర్ గా మిహీకకు మంచి గుర్తింపు
వ్యాపార కుటుంబానికి చెందిన మిహీక ఓ ఎంటర్‌ప్రెన్యూర్. ఆమె డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో అనే ఈవెంట్ మేనేజ్‌మెంట్ మరియు డెకర్ సంస్థను నిర్వహిస్తూ, ఈవెంట్ మేనేజ్‌మెంట్ లో మంచి గుర్తింపు సంపాదించారు. తన క్రియేటివిటీతో, బిజినెస్ మైండ్‌తో మిహీక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. మంచి ప్రొఫెషనల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ, పర్సనల్ లైఫ్ లో మిహీక చాలా సింపుల్ గా కనిపిస్తూ ఉంటారు.
పెళ్లికి ముందు అప్పుడప్పుడు వంట చేసేదాన్ని
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మిహీక, పెళ్లికి ముందు అప్పుడప్పుడు వంట చేసేదాన్నని, కానీ పెళ్లి తర్వాత మాత్రం అసలు కిచెన్ వైపు వెళ్లడం లేదని నవ్వుతూ చెప్పారు. దానికి గల కారణాన్ని కూడా మిహీక చెప్పారు. అమ్మ చాలా బాగా వంట చేస్తారని, అమ్మ అంటే అత్తమ్మ అంటూ చెప్పిన వైనం అందరినీ ఆకట్టుకుంటుంది. మిహీక మాటల్ని బట్టి చూస్తుంటే రానా తల్లిని కూడా ఆమె అమ్మ అనే పిలుస్తారని అర్థమవుతుంది. ఈ వ్యాఖ్యలు చూస్తే, మిహీక తన అత్తమామలతో ఎంతటి అనుబంధాన్ని ఏర్పరచుకున్నారో తెలుస్తోంది.
జీవితంలో ఎప్పుడూ అలాంటి రుచి తినలేదు
ఇక టేస్ట్ విషయానికి వస్తే, తన అత్తమ్మ చేసిన వంటల్లో మటన్ కర్రీ తనకు అత్యంత ఇష్టమని మిహీక వెల్లడించారు. తన జీవితంలో ఇప్పటివరకు అంత రుచిగా మటన్ ఎప్పుడూ తినలేదని ఆమె చెప్పడం విశేషం. సాధారణంగా సెలబ్రిటీలు తమ ఫిట్‌నెస్, డైట్‌లపై ఎక్కువ దృష్టి పెట్టే ఈ రోజుల్లో, ఇలాంటి హోమ్ ఫుడ్ గురించి ఆమె చెప్పిన మాటలు అభిమానుల్లో మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి.
మొత్తానికి, స్టార్ కుటుంబాల్లో కూడా సాదాసీదా కుటుంబ విలువలు, అనుబంధాలు ఎంత బలంగా ఉంటాయో మిహీక వ్యాఖ్యలు మరోసారి రుజువు చేస్తున్నాయి. గ్లామర్ ప్రపంచంలో బిజీగా ఉండే ఈ జంట, ఇంటి వాతావరణంలో మాత్రం సాధారణ కుటుంబంలా జీవిస్తున్నారని చెప్పాలి. ఈ విధంగా చూసుకుంటే, రానా- మిహీక దాంపత్య జీవితం కేవలం స్టార్డమ్‌కే పరిమితమవకుండా, ఎమోషన్స్ కు, ఫ్యామిలీ బాండింగ్స్ కు కూడా ప్రాధాన్యం ఇస్తుందనే విషయం స్పష్టమవుతోంది.