మైఖేల్ బయోపిక్.. ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుందా?

లెజెండరీ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ జీవితంపై రూపొందుతున్న హాలీవుడ్ బయోపిక్ మైఖేల్ ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.;

Update: 2026-04-21 05:34 GMT

లెజెండరీ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ జీవితంపై రూపొందుతున్న హాలీవుడ్ బయోపిక్ మైఖేల్ ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ అమెరికన్ మ్యూజికల్ బయోగ్రాఫికల్ డ్రామాలో జాక్సన్ పాత్రలో ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్ నటిస్తూ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం ప్రత్యేకతగా నిలిచింది. జాక్సన్ జీవితం, ఆయన సంగీత ప్రయాణం, వ్యక్తిగత సంఘటనలను ఆధారంగా చేసుకుని సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్.

సుమారు రూ.1900 కోట్ల భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్న ఆ సినిమా టెక్నికల్ పరంగా అత్యాధునికంగా సిద్ధం చేస్తున్నారు. 2డీ, ఐమ్యాక్స్ 2డీ, 4డీ ఎక్స్, ఐసీఈ, డాల్బీ సినిమా, స్క్రీన్ ఎక్స్ వంటి పలు ఫార్మాట్లలో విడుదల చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా మైఖేల్ జాక్సన్‌ కు ఉన్న భారీ అభిమానులను దృష్టిలో ఉంచుకుని, వారి అంచనాలకు తగ్గట్టు సినిమా రెడీ చేస్తున్నారు.

అయితే మైఖేల్ జాక్సన్‌ కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన సంగీతం, డ్యాన్స్, స్టేజ్ ప్రెజెన్స్ ఇప్పటికీ అభిమానులను అలరిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బయోపిక్‌ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఆయన జీవితంలోని ఎమోషనల్ స్టేజ్ ను సినిమాలో ఎంత స్ట్రాంగ్ గా మేకర్స్ చూపిస్తారన్నది కీలక అంశంగా మారింది.

ఇక ఇండియాతోపాటు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. అర్బన్ సెంటర్స్ లోని యువతలో చిత్రంపై ఇప్పటికే ఆసక్తి కనిపిస్తోంది. అయితే స్టోరీ ఎంత ఎమోషనల్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటే, కనెక్ట్ అయితే.. దేశవ్యాప్తంగా మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉందని క్లియర్ గా తెలుస్తోంది. మరేం జరుగుతుందో అంతా వేచి చూడాలి.

ఇక సినిమా విషయానికొస్తే.. మైఖేల్ కథా రచనలో జోన్ లాగోన్ సహకారం అందించగా, దర్శకత్వం ఆంటోని ఫుక్వా వహిస్తున్నారు. చిత్రంలో జాక్సన్ తండ్రి పాత్రలో కాల్మన్ డొమింగో, మైల్స్ టెల్లెర్, సుజాన్ డీ పాసేగా లారా హారియర్ తదితరులు నటిస్తున్నారు. నిర్మాతలుగా గ్రాహం కింగ్, జాన్ బ్రాంకా, జాన్ మెక్లెయిన్ వ్యవహరిస్తున్నారు. డియాన్ బీబే సినిమాటోగ్రఫి, జాన్ ఓట్టమన్ ఎడిటింగ్, మ్యూజిక్: లియర్ రాస్నర్ తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

లయన్స్ గేట్ ఫిల్మ్స్, జీకే ఫిల్మ్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఆ చిత్రం ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కానుంది. సెన్సార్ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయని, మూవీ క్వాలిటీపై కమిటీ నుంచి మంచి అభిప్రాయం వ్యక్తమైందని యూనిట్ తెలిపింది. 13 ఏళ్లు పైబడిన వారు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఆ చిత్రాన్ని వీక్షించవచ్చని, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న వారు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాలని సూచించినట్లు చెప్పింది.

Tags:    

Similar News