• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రియుడితో ఘ‌నంగా మేఘా...

ప్రియుడితో ఘ‌నంగా మేఘా ఆకాష్ వివాహం

| న‌టి మేఘా ఆకాష్ ఓ ఇంటిదైంది. ప్రియుడు సాయి విష్ణుతో ఆమె వివాహం ఘ‌నంగా జ‌రిగింది.

By - Tupaki Desk
Update: 2024-09-15 15:32 GMT

న‌టి మేఘా ఆకాష్ ఓ ఇంటిదైంది. ప్రియుడు సాయి విష్ణుతో ఆమె వివాహం ఘ‌నంగా జ‌రిగింది. ఆదివారం ఉద‌యం చెన్నైలోని ఓ ప్ర‌ముఖ ఫంక్ష‌న్ హాలులో ఈ వివాహం జ‌రిగింది. ఇరు కుటుంబాల పెద్ద‌లు, సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఈ వివాహానికి హాజ‌రై నూత‌న దంపతుల్ని ఆశీర్వ‌దించారు. శ‌నివారం సాయంత్రం వెడ్డింగ్ రిసెప్ష‌న్ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ హాజ‌రై దంప‌తుల‌కు అభినంద‌న‌లు తెలిపారు.

ప్ర‌స్తుతం ఆ వివాహానికి సంబంధించిన ఫోటోలు నెటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. పెళ్లి కూతురు దుస్తుల్లో మేఘా ఆకాష్ ఎంతో అందంగా ఉంది. పెళ్లి పీఠ‌ల‌పై భ‌ర్త విష్ణు భార్య బుగ్గ‌ను ముద్దాడుతున్నాడు. ఆ స‌మ‌యంలో మేఘా ఆకాష్ ఎంతో అందంగా న‌వ్వుతూ సిగ్గులొలికించింది. అలాగే నిశ్చితార్దం సంద‌ర్భంగా వ‌ధువ‌రూలిద్దరు దిగిన ఓటోల్లోనూ జంట ఎంతో అందంగా క‌నిపిస్తుంది. సంప్ర‌దాయ దుస్తుల్లో ఇద్ద‌రు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ముస్తాబ‌య్యారు.

మేఘా ఆకాష్ `లై `సినిమాతో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. అందులో నితిన్ కి జోడీగా న‌టించింది. ఆ సినిమా పెద్దగా ఆడ‌లేదు. అయినా ఆ వెంట‌నే నితిన్ తోనే `ఛ‌ల్ మోహ‌న‌రంగ` అనే మ‌రో సినిమా చేసింది. అది ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌లేదు. ఆ త‌ర్వ‌త త‌మిళ్, హిందీలోనూ కొన్ని సినిమాలు చేసింది. ఆ త‌ర్వాత కొంత గ్యాప్ అనంత‌రం మ‌ళ్లీ మ‌రికొన్ని తెలుగు సినిమాలు చేసింది.

కానీ ఇవేవి మేఘా ఆకాష్ నిల‌దొక్కుకోవ‌డానికి ప‌ని కొచ్చిన సినిమాలు కావు. దీంతో త‌మిళ్ సినిమాల‌పై దృష్టి పెట్టింది. ప్ర‌స్తుతం తెలుగు లోనూ ఓ రెండు సినిమాలు చేస్తోంది. పెళ్లికి ముందు క‌మిట్ అయిన సినిమాలివి. మ‌రి వివాహ‌మైన నేప‌థ్యంలో సినిమాలు కంటున్యూ చేస్తుందా? లేదా? అన్న‌ది చూడాలి.

#Meghaakash New Chapter Begins @akash_megha pic.twitter.com/wI72MMnCf6

— Kollywood Ent (@Kollywoodent) September 15, 2024
Tags:    
  • Meghaakash 
  • Actress 
  • Tollywood 
  • Filmindustry 
  • Saaivishnu 
  • Wedding 
  • Boyfriend 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS