• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చీర కట్టి చూపు...

చీర కట్టి చూపు తిప్పనివ్వని బ్యూటీ

| కానీ ఆ సినిమా కమర్షయిల్‌గా విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది.

By - Tupaki Desk
Update: 2024-11-26 05:49 GMT

నితిన్ హీరోగా నటించిన 'లై' సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయం అయిన తమిళ్‌ బ్యూటీ మేఘా ఆకాష్‌ మొదటి సినిమాతో ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కించుకోలేక పోయింది. 2017లో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మేఘా ఆకాష్ ఆ వెంటనే నితిన్‌తోనే మరోసారి చల్‌ మోహన్‌ రంగా సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద నిరాశ మిగిల్చింది. టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌ పడటంతో కోలీవుడ్‌లో తన అదృష్టంను పరీక్షించుకునేందుకు అక్కడ అడుగు పెట్టింది. మొదటి సినిమానే సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ పేట కావడంతో అక్కడ అందరి దృష్టిని ఈ అమ్మడు ఆకర్షించింది. కానీ ఆ సినిమా కమర్షయిల్‌గా విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది.


తమిళ్‌, హిందీలో వరుసగా ఏడాదికి రెండు మూడు సినిమాల చొప్పున చేస్తూ వచ్చిన మేఘా ఆకాష్ తెలుగులో దాదాపు మూడు ఏళ్ల గ్యాప్ తర్వాత రాజ రాజ చోర సినిమాలో నటించింది. మేఘా ఆకాష్ ఈ భాష ఆ భాష అనే తేడా లేకుండా ప్రతి భాషలోనూ వచ్చిన అవకాశంను సద్వినియోగం చేసుకుంటూ సినిమాలు చేస్తూ వస్తుంది. ఈ మధ్య కాలంలో ఈమె వరుసగా సినిమాలు చేస్తోంది. ముఖ్యంగా గత ఏడాది ఈమె నుంచి ఏకంగా ఏడు సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఈమె నుంచి రెండు సినిమాలు రాగా మరో రెండు సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. త్వరలోనే ఆ సినిమాలు సైతం వచ్చే అవకాశాలు ఉన్నాయి.


సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా మేఘా ఆకాష్‌ అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేస్తూ వస్తోంది. తాజాగా చీర కట్టులో కనిపించిన మేఘా కన్నుల విందు చేసింది. చీర కట్టి స్కిన్‌ షో చేస్తే జనాలు చూస్తారు. కానీ మేఘా ఆకాష్ స్కిన్‌ షో చేయకుండానే జనాలు చూపు తిప్పుకోకుండా చూసే విధంగా అందంగా ఉంది. ఈ స్థాయి అందం చీర కట్టులో మేఘా ఆకాష్‌ కి మాత్రమే సాధ్యం అనే అభిప్రాయంను నెటిజన్స్ వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు, వీడియోలు రెగ్యులర్‌గా వైరల్‌ కావడం మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు కూడా అదే విధంగా ఈ అమ్మడి అందాల విందు ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.


ఆరు ఏళ్లుగా ప్రేమలో ఉన్న మేఘా ఆకాష్ ఇటీవలే పెళ్లి పీటలు ఎక్కింది అనే విషయం తెల్సిందే. సాయి విష్ణుతో 22 ఆగస్టు 2024న నిశ్చితార్థం అయింది. ఈ జంట 15 సెప్టెంబర్ 2024న చెన్నైలో సంప్రదాయ వివాహ వేడుకలో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాల ఎంపిక విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని, ముందు ముందు వరుసగా సినిమాలు చేస్తానంటూ మేఘా ఆకాష్ ఒక ఇంటర్వ్యూలో ప్రకటించింది. అలాగే అందాల ఆరబోత విషయంలోనూ పెళ్లికి ముందు ఎలా అయితే ఉందో ఇప్పుడూ అదే తరహాలో వ్యవహరిస్తాను అంటూ ప్రకటించింది. అంతే కాకుండా మేఘా ఆకాష్ ఇతర హీరోలతో కలిసి ఎక్కువ సినిమాల్లో నటించేందుకు సైతం ఆసక్తి చూపిస్తుంది.

Tags:    
  • Meghaakash 
  • Actress 
  • Trendinglooks 
  • Trendingclicks 
  • Pictalk 
  • Actressmeghaakash 
  • Phototalk 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS