• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మూడు లోకాలతో మెగా 156..

మూడు లోకాలతో మెగా 156..

| మరి సెకండ్ ఇన్నింగ్ లో జగదీకవీరుడు అతిలోక సుందరి లాంటి సోషియో ఫాంటసీ కథతో చేయబోతున్న ఈ మూవీ మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి సక్సెస్ ఇస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

By - Tupaki Desk
Update: 2023-10-26 05:29 GMT

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీ మెగా 156. భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యింది. దసరా సందర్భంగా మూవీని గ్రాండ్ గా లాంచ్ చేశారు. మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్ లో సరికొత్త కథతో చేస్తోన్న మూవీ కావడంతో ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.

ఇదిలా ఉంటే వచ్చే ఏడాది ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం క్యాస్టింగ్ ఫైనల్ చేయడంపై దర్శకుడు వశిష్ట మల్లిడి దృష్టి పెట్టాడు. ఈ సినిమాలో అనుష్కని హీరోయిన్ గా ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ప్రతినాయకుడిగా రానా పేరు పరిశీలిస్తున్నారు. ఇంకా అఫీషియల్ గా ఫైనల్ కావాల్సి ఉంది.

ఈ మూవీ సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రానటువంటి సరికొత్త సబ్జెక్ట్ గా వశిష్ట మల్లిడి ఈ సినిమాలో చూపించబోతున్నారని అని సమాచారం. మూడు లోకాలని కలుపుతూ సాగే లవ్ రొమాంటిక్ ఫాంటసీ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతోందని అంట. అలాగే ఈ మూడు లోకాలకి లింక్ చేస్తూ ఒక చిన్న పిల్ల పాత్ర కూడా ఉంటుందని తెలుస్తోంది.

ఈ పాత్ర ప్రధానంగానే వశిష్ట మల్లిడి కథని సిద్ధం చేసారంట. స్టొరీలైన్ అయితే వినడానికి ఇంటరెస్టింగ్ గా ఉంది.ఈ సినిమాకి విశ్వంభర అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. చిత్ర యూనిట్ లో అందరికి ఈ పేరు నచ్చడంతో దీనినే ఫైనల్ చేసే అవకాశం ఉందని టాక్. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ చిత్రంతో తన ఇమేజ్ ని పూర్తిగా మార్చుకోవాలని అనుకుంటున్నాడు.

మరి సెకండ్ ఇన్నింగ్ లో జగదీకవీరుడు అతిలోక సుందరి లాంటి సోషియో ఫాంటసీ కథతో చేయబోతున్న ఈ మూవీ మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి సక్సెస్ ఇస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సూపర్ హిట్ అయితే మాత్రం మెగాస్టార్ ఇకపై రెగ్యులర్ కమర్షియల్ జోనర్ నుంచి బయటకొచ్చి బియాండ్ లైన్ లో కథలు చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట.

Tags:    
  • Tollywood 
  • Chiranjeevi 
  • Vashishtamallidi 
  • Anushka 
  • Rana 
  • Jagadikaveeruathilokasundari 

Similar News

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

Copyright @2026

Powered by Blink CMS