• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇట‌లీలో మ‌న‌వ‌రాలితో మెగా...

ఇట‌లీలో మ‌న‌వ‌రాలితో మెగా దంపతుల‌ ఆట‌లు!

| క్లీంకార పుట్టిన త‌ర్వాత తాత‌య్య‌-నాయ‌న‌మ్మ‌లు చిరంజీవి-సురేఖ‌లు జంట‌గా మ‌న‌వ‌రాలితో క‌నిపించింది చాలా త‌క్కువ‌.

By - Tupaki Desk
Update: 2023-11-02 08:40 GMT

క్లీంకార పుట్టిన త‌ర్వాత తాత‌య్య‌-నాయ‌న‌మ్మ‌లు చిరంజీవి-సురేఖ‌లు జంట‌గా మ‌న‌వ‌రాలితో క‌నిపించింది చాలా త‌క్కువ‌. ప్ర‌సవం త‌ర్వాత ఉపాస‌న‌ని మెట్టినింటికి ఆహ్వానిస్తోన్న స‌మ‌యంలో చ‌ర‌ణ్‌..సురేఖ‌లు ఉన్నారు త‌ప్ప చిరంజీవి లేరు. అప్పుడాయ‌న ఇత‌ర కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉండ‌టంతో చిరు క‌నిపించ లేదు. ఆ త‌ర్వాత మ‌న‌వ‌రాలితో ఆ దంపతులు మీడియాలో ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

క్లీంకార‌తో కెమోరా బిహైండ్ ఆడుకున్నారు త‌ప్ప‌! కెమెరా ముందు ప్రేక్ష‌కాభిమానుల‌కు తెలిసేలా చేసింది మాత్రం ఇట‌లీ లో ఈ స‌న్నివేశ‌మ‌నే చెప్పాలి. వ‌రుణ్ తేజ్-లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి నేప‌థ్యంలో మెగా ఫ్యామిలీ అంతా ఇట‌లీకి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. పెళ్లిలో భాగంగా అంతా క‌లిసి కూర్చుని ఎంజాయ్ చేసారు. అలాంటి మూవ్ మెంట్ నుంచి ఓ పిక్ లీక్ అయింది. అందులో చిరంజీవి..సురేఖ‌లు క్లీంకార‌కి తాత‌-న‌య‌న‌మ్మ ప్రేమ‌లో పంచుతోన్న వైనం ముచ్చ‌టేస్తుంది.

ఇద్దరు మ‌న‌వ‌రాలితో సంతోషంగా ఆడుకుంటున్నారు. చిన్ని..బుజ్జి క‌న్నా అంటూ ముద్దు చేస్తున్నారు. సురేఖ ఒడిలో క్లీంకార ఉంది. ఆ ప‌క్క‌నే కూర్చున్న చిరంజీవి తాత‌య్య ముక్కును ..పెదాల్ని గీటుతూ లాలిస్తున్నారు. మ‌న‌వ‌రాలితో ఇలాంటి ఫోటో ఇదే మొద‌టిది. ఇంత‌వ‌ర‌కూ ఇలాంటి ఫోటో మీడియాకి చిక్క‌లేదు. దీంతో ఆ ఫోటోపై ప్రత్యేక క‌థ‌నాలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. మ‌న‌వ‌రాలితో మెగాస్టార్ అంటూ అభిమానులు సంతోషిస్తున్నారు.

సోషల్ మీడియా వేదిక‌గా అభిమానులు తోచిన కామెంట్ల రూపంలో ప్రేమ‌ని పంచుతున్నారు. చిరంజీవి కుమార్తెల బిడ్డ‌ల‌తో చాలాసార్లు క‌నిపించారు. అయితే వాళ్లు పెద్దైన త‌ర్వాత ఎక్క‌వ‌గా ఆ ఫోటోలు బ‌య‌ట‌కు వచ్చాయి. నెల‌లు వ‌య‌సున్న స‌మ‌యంలో ఆ ఫోటోలు ఎక్క‌డా బ‌య‌ట‌కు రాలేదు. తొలిసారి కొడుకు బిడ్డ‌తో చిరంజీవి ఇలా క‌నిపించ‌డం ఆస‌క్తిక‌రం. అభిమానుల‌కు ఆ దృశ్యాన్ని చూడ‌టం క‌న్నుల విందుగా ఉంది.

Tags:    
  • Chiranjeevi 
  • Ramcharan 
  • Upasana 
  • Tollywood 
  • Italy 
  • MegaFamillyWedding 
  • Varunlavwedding 

Similar News

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

Copyright @2026

Powered by Blink CMS