2026 ఆరంభంలోనే మెగా బ్లాస్ట్!
అతడు హీరోగా నటిస్తోన్న `సంబరాల ఏటిగట్టు` ఇప్పటికే రిలీజ్ అవ్వాలి. కానీ షూటింగ్ జాప్యం సహా పలు కారణాలతో రిలీజ్ అవ్వలేదు.;
మెగా హీరోలు నటించిన సినిమాలు ఒకే ఏడాది రిలీజ్ అయి చాలా కాలమవు తుంది. అందులోనూ బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ అన్నది యాదృశ్చకంగా జరిగితే తప్ప సాధ్యం కాదు. చాలా కాలానికి మళ్లీ 2026 అందుకు వేదికగా మారింది.కొత్త ఏడాది తొలి మాసంలోనే మెగాస్టార్ చిరంజీవి `మనశంకర వరప్రసాద్ గారు`తో అలరించ నున్నారు.సంక్రాంతి కానుకగా అన్నయ్య ప్రేక్షకుల్న అలరించబోతు న్నారు. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. టీమ్ అనుకున్నది పక్కాగా జరిగితే గనుక శంకరప్రసాద్ 500 కోట్ల క్లబ్ లో చేరిపోతాడు.
తండ్రి తర్వాత రెడీగా తనయుడు:
అనంతరం ఒక నెల గ్యాప్ లోనే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా `పెద్ది` రిలీజ్ తో ప్రేక్షకుల మధ్యలో ఉంటాడు. మార్చి 27న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు తగట్టు దర్శకుడు బుచ్చిబాబు షూటింగ్ సహా అన్ని పనులు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్న చిత్రమిది. చరణ్ ఈ సినిమాతో 1000 కోట్ల క్లబ్ లో చేరతాడా? లేదా? అన్న దానిపై ఆసక్తికర డిబేట్ జరుగుతోంది. మామ-బావల మధ్యలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా వచ్చే అవకాశం ఉంది.
మధ్యలో మెగామేనల్లుడు ఉన్నాడు:
అతడు హీరోగా నటిస్తోన్న `సంబరాల ఏటిగట్టు` ఇప్పటికే రిలీజ్ అవ్వాలి. కానీ షూటింగ్ జాప్యం సహా పలు కారణాలతో రిలీజ్ అవ్వలేదు. దీంతో 2026 ప్రధమా ర్ధంలోనే ఈ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఏప్రిల్ లోనే మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఒకేసారి సందడి చేసే అవకాశం ఉంది. చిరు నటిస్తోన్న `విశ్వంభర `లో జాప్యం సంగతి తెలిసిందే. సీజీ పనులు కారణంగా డిలే అవుతుంది. మార్చికల్లా ఆ పనులు పూర్తవుతాయన్నది తాజా సమాచారం. అదే జరిగితే ఏప్రిల్ లో రిలీజ్ లాంఛనమే.
అన్నదమ్ములిద్దరు ఒకేనెలలో:
అదే నెలలలో పవన్ కళ్యాణ్ నటిస్తోన్న `ఉస్తాద్ భగత్ సింగ్` కూడా రిలీజ్ అవుతుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇప్పటికే పీకే తన పోర్షన్ షూటింగ్ కూడా పూర్తి చేసారు. మిగతా పనులు మార్చి కల్లా పూర్తి చేయాలన్నది హరీష్ ప్లాన్. అదే జరిగితే? ఏప్రిల్ రిలీజ్ ఉంటుంది. మరీ మే వరకూ వెళ్లే అవకాశం ఉండుదు. తీవ్రమైన ఎండలు కూడా రిలీజ్ కు అనుకూలం కాదు కాబట్టి? చాలా సినిమాలు ఏప్రిల్ లోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. చిరు-పవన్ సినిమాలు ఒకే నెలలో రిలీజ్ అవ్వడం అన్నది ఇంత వరకూ జరగలేదు. రిలీజ్ అయితే అదో రికార్డు గా చెప్పొచ్చు.