మళ్లీ అలాంటి పాత్రలో చిరంజీవి? బాబీ సినిమా పై హైప్!

ఈ వయసులో కూడా చిరంజీవి ఈ సినిమా కోసం జిమ్‌లో కఠినమైన వర్కౌట్స్ చేస్తూ తన బాడీని మార్చుకుంటున్నారు.

Update: 2026-06-14 06:15 GMT

మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో వస్తున్న 'మెగా 158' చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వస్తున్న ఈ సినిమాలో చిరంజీవి అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నారనే వార్త మెగా ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. ఒక పాత్రలో డాక్టర్‌గా, మరో పాత్రలో పవర్‌ఫుల్ మాస్ లుక్‌లో చిరు కనిపించబోతున్నారట. చాలా కాలం తర్వాత మెగాస్టార్‌ను ఇలాంటి డ్యూయల్ రోల్‌లో చూడటం అభిమానులకు అసలైన కన్నుల పండగ అని చెప్పాలి. ఆ వివరాలు చూద్దాం..

బాబీ మార్క్ మాస్ ఎంటర్‌టైనర్:

దర్శకుడు బాబీకి మెగాస్టార్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. అందుకే చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా ఒక హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఆయన సిద్ధం చేశారు. ఇక ఇప్పటికే పొల్లాచ్చిలో జరిగిన మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వడంతో సినిమా పనులు వేగంగా సాగుతున్నాయి.

డాక్టర్ వర్సెస్ మాస్ లీడర్:

ఈ సినిమాలో చిరంజీవి రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తున్నారు. ఒక పాత్రలో క్లాస్‌గా డాక్టర్‌గా కనిపిస్తుండగా, రెండో పాత్రలో ఊర మాస్ లుక్‌లో అలరించబోతున్నారు. మొదట ఈ తమ్ముడి పాత్ర కోసం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌ను అనుకున్నారట, కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా మెగాస్టార్‌కే దక్కడంతో డబుల్ యాక్షన్ గ్యారెంటీ అయిపోయింది టాక్.

మెగాస్టార్ మేకోవర్ మరియు కాస్టింగ్:

ఈ వయసులో కూడా చిరంజీవి ఈ సినిమా కోసం జిమ్‌లో కఠినమైన వర్కౌట్స్ చేస్తూ తన బాడీని మార్చుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో నివేతా పేతురాజ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. అనసవర రాజన్, డింపుల్ హయాతి కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇంతమంది స్టార్స్ ఉండటంతో సినిమా రేంజ్ పెరిగిపోయింది.

సంక్రాంతి బరిలో మెగా సందడి:

ఈ భారీ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. సంక్రాంతి అంటేనే మెగాస్టార్‌కు సెంటిమెంట్.ఈ ఏడాది సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గా వచ్చి రికార్డులు క్రియేట్ చేసారు. ఇక మరి 'మెగా 158' తో బాబీ, చిరంజీవి కలిసి ఏ స్థాయి బాక్సాఫీస్ సునామీ సృష్టిస్తారో చూడాలి.

ఇక అన్నదమ్ములుగా చిరంజీవి చేసే సందడి వెండితెరపై ఎప్పుడూ స్పెషలే. మరి బాబీ ఈ డ్యూయల్ రోల్‌ను ఎలా హ్యాండిల్ చేస్తారో, మెగాస్టార్ తన నటనతో మనల్ని ఎలా మెప్పిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఏదేమైనా మెగా ఫ్యాన్స్‌కు మాత్రం 2027 సంక్రాంతి పూనకాలే.

Tags:    

Similar News