43 వ‌య‌సులో 3వ విడాకులిచ్చిన ప్ర‌ముఖ న‌టి

ఇటీవ‌ల ఇన్ స్టాలో న‌టి మీరా త‌న విడాకుల గురించి వెల్ల‌డించారు. తాను ఆగస్టు 2025 నుండి ఒంటరిగా ఉన్నానని అధికారికంగా ప్రకటించారు.;

Update: 2025-11-18 04:16 GMT

సెల‌బ్రిటీ ప్ర‌పంచంలో వారానికో విడాకుల వార్త వినాల్సి వ‌స్తోంది. ఇప్పుడు ప్ర‌ముఖ మలయాళ నటి మీరా వాసుదేవన్ తన మూడవ వివాహం విడాకులతో ముగిసినట్లు ప్రకటించారు. 43 ఏళ్ల వ‌య‌సు మీరా సినిమాటోగ్రాఫర్ విపిన్ పుతియంకంను గ‌త ఏడాది ఏప్రిల్ లో వివాహం చేసుకున్నారు. వీరి సాహ‌చ‌ర్యం ఆగస్టు 2025తో ముగిసింది.



 


ఇటీవ‌ల ఇన్ స్టాలో న‌టి మీరా త‌న విడాకుల గురించి వెల్ల‌డించారు. తాను ఆగస్టు 2025 నుండి ఒంటరిగా ఉన్నానని అధికారికంగా ప్రకటించారు. నా జీవితంలో అత్యంత అద్భుతమైన, ప్రశాంతమైన దశలో ఉన్నాను! అంటూ వెల్ల‌డించారు. #ఫోక‌స్డ్, #బ్లెస్డ్, #గ్రాటిట్యూడ్, #మీరా వాసుదేవ‌న్ అంటూ కొన్ని హ్యాష్ ట్యాగుల్ని కూడా వైర‌ల్ చేసారు. అలాగే విడాకుల‌ను ప్ర‌క‌టించిన స‌మ‌యానికి త‌న మూడో భ‌ర్త‌ విపిన్ పుతియంకంతో పెళ్లి వేడుకకు సంబంధించిన అన్ని ఫోటోలను కూడా తొలగించారు.

పాపుల‌ర్ వెబ్ సైట్ కథనం ప్రకారం.. మీరా వాసుదేవన్ - విపిన్ పుతియంకం టీవీ సీరియల్ `కుటుంబం విలక్కు` సెట్స్‌లో కలుసుకున్నారు. ఈ జోడీ గత సంవత్సరం కోయంబత్తూరులో వివాహం చేసుకున్నారు. ఏడాది లోగానే ఈ విడాకుల‌ను ప్ర‌క‌టించ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

మీరా వాసుదేవన్ గతంలో సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ కుమారుడు విశాల్ అగర్వాల్‌ను పెళ్లాడారు. వారు 2005లో వివాహం చేసుకుని 2010లో విడాకులు తీసుకున్నారు. రెండు సంవత్సరాల తరువాత నటుడు జాన్ కొక్కెన్‌ను మీరా వివాహమాడారు. ఒక కొడుకు ఉన్న ఈ జంట 2016లో విడిపోయారు. ఇప్పుడు విపిన్ నుంచి విడాకులు అయింది.

మ‌ల‌యాళంలో తన్మాత్ర, ఒరువన్, వైరం: ఫైట్ ఫర్ జస్టిస్, ఆమ్ ఆహ్ వంటి చిత్రాలతో మీరా న‌టిగా పాపుల‌ర‌య్యారు. మిలింద్ సోమన్‌తో రూల్స్: ప్యార్ కా సూపర్‌హిట్ ఫార్ములా, సైఫ్ అలీ ఖాన్, రాణి ముఖర్జీతో తోడి లైఫ్ తోడా మ్యాజిక్, ఆర్ మాధవన్ నటించిన `13బి: ఫియర్ హాజ్ ఎ న్యూ అడ్రస్` వంటి హిందీ చిత్రాలలో న‌టించారు. త‌మిళంలో ఉన్నై సరనదైంతెన్, అరివుమణి అనే చిత్రాల‌లో న‌టించారు. ఈ నటి ప్రస్తుతం మలయాళ టీవీ షో `మధురనోంబరకట్టు`లో సుజాత పాత్రను పోషిస్తోంది.

Tags:    

Similar News