• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హర్యానా బ్యూటీ టాలెంట్ ను...

హర్యానా బ్యూటీ టాలెంట్ ను సరిగ్గా యూజ్ చేసుకోండి బాసూ!

| "ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్" సినిమాలో తమిళ హీరో దళపతి విజయ్ కు జోడీగా నటిస్తోంది మీనాక్షి చౌదరి.

By - Tupaki Desk
Update: 2024-08-09 06:30 GMT

గార్జియస్ బ్యూటీ మీనాక్షి చౌదరి ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా మారిపోయింది. ఓవైపు స్టార్ హీరోల సరసన నటిస్తూనే, మరోవైపు యంగ్ హీరోలతో రొమాన్స్ చేస్తోంది. ఆమె నటించిన మూడు చిత్రాలు రెండు నెలల గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో రెండు రోజుల గ్యాప్ లో 'ది గోట్', 'లక్కీ భాస్కర్' వంటి సినిమాలు రిలీజ్ అవుతుంటే.. దీపావళి స్పెషల్ గా అక్టోబర్ చివర్లో 'మెకానిక్ రాకీ' మూవీ విడుదల కానుంది.


"ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్" సినిమాలో తమిళ హీరో దళపతి విజయ్ కు జోడీగా నటిస్తోంది మీనాక్షి చౌదరి. వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ.. సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, మీనాక్షి జంటగా.. వెంకీ అట్లూరి రూపొందిస్తున్న 'లక్కీ భాస్కర్' సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. ఇక టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తో కలిసి నటిస్తున్న 'మెకానిక్ రాకీ' అక్టోబర్ 32న విడుదల చెయ్యాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటి వరకూ 'హిట్ 2' మినహా సోలో హీరోయిన్ గా సరైన హిట్ అందుకోని మీనాక్షి చౌదరీ.. రాబోయే మూడు సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. 'లక్కీ భాస్కర్' నుంచి నెల రోజుల క్రితం రిలీజైన 'శ్రీమతి గారు' పాటకు మంచి స్పందన లభించింది. సాదారణ గృహిణిగా మీనాక్షి ఆకట్టుకుంది. కానీ రీసెంట్ గా వచ్చిన 'ది గోట్' సాంగ్ కు ఆశించినంత పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. విజయ్ లుక్‌తో పాటుగా మ్యూజిక్, విజువల్ ప్రెజెంటేషన్ పైనా విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. దీంతో మీనాక్షి గురించి అసలు చర్చే లేకుండా పోయింది. ఇక మెజానిక్ రాకీ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చింది. దీనికి ఆడియన్స్ నుంచి ఓ మాదిరి రెస్పాన్స్ వచ్చింది.

మ్యూజిక్ ఎలా ఉందనే సంగతి పక్కన పెడితే, 'స్పార్క్' 'గుల్లెడు గుల్లేడు' పాటల్లో మీనాక్షి చౌదరీ ఏమంత ఆకట్టుకోలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆమె లుక్స్ ఫ్యాన్స్ ను సైతం నిరాశపరిచాయి. ఆఫ్-స్క్రీన్ లో ఆమె ఎంత గ్లామరస్ గా ఉంటుందో సోషల్ మీడియాలో చూస్తే అర్థం అవుతుంది. డ్యాన్స్ స్కిల్స్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఆన్ స్క్రీన్ లో మాత్రం ఆమెను ఆకర్షణీయంగా చూపించలేదని, హర్యానా బ్యూటీ టాలెంట్ ను సరిగా ఉపయోగించుకోలేదని అభిప్రాయ పడుతున్నారు.

బ్యాక్ టూ బ్యాక్ రెండు పాటలు రిలీజైనా ఎక్కడా అమ్మడి గురించి మాట్లాడుకోవడం లేదని అంటున్నారు. పాటల్లోనే ఇలా ఉంటే, ఇంక సినిమాలో ఆమెను ఎలా చూపించి ఉంటారో అని డౌట్ పడుతున్నారు. ఏదేమైనా లిరికల్ వీడియోలు చూసి ఒక నిర్ణయానికి రావడం సరికాదు. సినిమాల్లో తప్పకుండా మీనాక్షి అలరిస్తుందని, రాబోయే పాటలతో ఆకట్టుకుంటుందని సినీ అభిమానులు ఆశిస్తున్నారు.

ఇకపోతే చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 'విశ్వంభర' చిత్రంలో మీనాక్షి చౌదరి కీలక పాత్ర పోషిస్తోంది. వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో రూపొందే హ్యాట్రిక్ మూవీలో పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలనూ 2025 సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'మట్కా' సినిమాలో మీనాక్షి హీరోయిన్ గా చేస్తోంది. ఈ పీరియడ్ డ్రామా వచ్చే ఏడాదే విడుదల కానుంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న అర డజను సినిమాలు కెరీర్ ను నెక్ స్ట్ లెవల్ కు తీసుకెళ్తాయేమో చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Filmindustry 
  • TheGreatestofAllTime 
  • VijayThalapathy 
  • VenkatPrabhu 
  • LuckyBhaskar 
  • Mechanicrocky 
  • Vishwaksen 
  • MeenakshiChaudhary 
  • Vishwambhara 
  • Venkatesh 
  • Anilravipudi 
  • Varuntej 
  • Matka 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS