బ్యాక్‌ టు బ్యాక్ హిట్‌తో మీనూ మేడం బిజీ బిజీ

టాలీవుడ్‌లో ప్రస్తుతం మీనాక్షి చౌదరి టైం నడుస్తోంది. రాబోయే రోజుల్లో యంగ్‌ స్టార్‌ హీరోలకు జోడీగా ఈ అమ్మడు నటించబోతుంది.;

Update: 2025-05-28 08:30 GMT

టాలీవుడ్‌లో ప్రస్తుతం మీనాక్షి చౌదరి టైం నడుస్తోంది. రాబోయే రోజుల్లో యంగ్‌ స్టార్‌ హీరోలకు జోడీగా ఈ అమ్మడు నటించబోతుంది. గత ఏడాదిలో లక్కీ భాస్కర్‌ సినిమాతో విజయాన్ని సొంతం చేసుకున్న మీనాక్షి చౌదరి ఈ ఏడాది ఆరంభంలో వెంకటేష్‌తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా, వెంకటేష్ మాజీ ప్రియురాలు అయిన మీనూ పాత్రలో ఈమె నటించి మెప్పించింది. ముఖ్యంగా మీనాక్షి చౌదరి అందంతో పాటు, అభినయం తో మెప్పించింది.

గత ఏడాది ఆరంభంలో గుంటూరు కారం సినిమాలో నటించింది. ఆ సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా కనిపించడంతో పాటు, ఆ సినిమా హిట్‌ కాకపోవడంతో మీనాక్షి చౌదరికి నిరాశే మిగిలింది. ఆ తర్వాత తమిళ్ సూపర్‌ స్టార్‌ విజయ్‌తో కలిసి ది గోట్‌ సినిమాలోనూ నటించింది. ఆ సినిమాతో తమిళనాట కూడా ఈమెకు మంచి గుర్తింపు దక్కింది. అయితే లక్కీ భాస్కర్‌, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు సూపర్‌ హిట్‌ కావడంతో టాలీవుడ్‌లోనే ఈమెకు ఎక్కువగా ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం ఈమె రెండు క్రేజీ సినిమాల్లో ఈమె నటిస్తుంది. ఆ రెండు సినిమాల్లో ఒకటి ఈ ఏడాది విడుదల కానుండగా, మరోటి వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

నవీన్ పొలిశెట్టి హీరోగా రూపొందుతున్న అనగనగా ఒక రాజు సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యి చాలా రోజులు అయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తున్న నేపథ్యంలో అంచనాలు మరింత పెరిగాయి. ఆ మధ్య నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి ల వీడియో ఒకటి బయటకు వచ్చింది. వీరిద్దరికి సరి జోడీ అంటూ అంతా ప్రశంసించారు. నవీన్‌ పొలిశెట్టితో మాత్రమే కాకుండా నాగ చైతన్యతోనూ మీనాక్షి చౌదరి ఒక సినిమాను కమిట్‌ అయింది. కార్తీక్‌ దండు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా రూపొందబోతున్న సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించబోతుంది.

తండేల్‌ వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత నాగ చైతన్య సినిమా అనగానే అంచనాలు భారీగా ఉన్నాయి. దానికి తోడు కార్తీక్‌ దండు దర్శకత్వంలో సినిమా కావడంతో అంచనాలు మరింతగా ఉన్నాయి. తండేల్‌ రేంజ్‌లో మరో వంద కోట్ల సినిమాను నాగ చైతన్య చేయబోతున్నాడనే విశ్వాసంను అక్కినేని ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. అలాంటి క్రేజీ మూవీలో నాగ చైతన్య నటిస్తున్న నేపథ్యంలో మీనాక్షి చౌదరి క్రేజ్‌ మరింతగా పెరగడం ఖాయం. వచ్చే ఏడాదిలో ఈ అమ్మడు మరిన్ని క్రేజీ మూవీల్లో, స్టార్‌ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయి. వరుసగా విజయాలను సొంతం చేసుకున్న మీనాక్షి చౌదరి వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.

Tags:    

Similar News