హీరోతో పెళ్లి వార్తలు.. మీనాక్షి టీమ్ ఏం చెప్పిందంటే?

మీనాక్షి, సుశాంత్ ఇచట వాహనములు నిలుపరాదు అనే చిత్రంలో నటించగా, అప్పుడే వారి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని వార్తలు వస్తున్నాయి.;

Update: 2025-12-06 12:27 GMT

టాలీవుడ్ యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరీ, యువ కథానాయకుడు సుశాంత్ వివాహం చేసుకోబోతున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. నిజానికి ఎప్పటి నుంచో వారిద్దరూ రిలేషన్ లో ఉన్నారని ఊహాగానాలు చక్కర్లు కొడుతుండగా.. రీసెంట్ గా ఎయిర్ పోర్ట్ లో కలిసి కనిపించడంతో మళ్లీ ఊపందుకున్నాయి.

మీనాక్షి, సుశాంత్ ఇచట వాహనములు నిలుపరాదు అనే చిత్రంలో నటించగా, అప్పుడే వారి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని వార్తలు వస్తున్నాయి. అది కాస్త ఆ తర్వాత ప్రేమగా మారిందని, హీరోయిన్‌ గా బిజీగా ఉండటంతో త్వరలోనే చేతిలోని సినిమాలు పూర్తి చేసి సుశాంత్‌ ను మీనాక్షి పెళ్లి చేసుకుంటారని రూమర్లు స్ప్రెడ్ అవుతున్నాయి.

దీంతో ఆ వార్తలపై ఇప్పుడు మీనాక్షి చౌదరీ టీమ్ రెస్పాండ్ అయింది. సుశాంత్ తో పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు ఉత్తుత్తి వేనని తెలిపింది. ఎవరూ ఎలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని సూచించింది. ఈ మేరకు తాజాగా అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది.

సుశాంత్, మీనాక్షి కేవలం మంచి స్నేహితులు మాత్రమేనని హీరోయిన్ టీమ్ స్పష్టం చేసింది. వారిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ తప్ప మరో రిలేషన్ లేదని క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరింది. అంతే కాదు మీనాక్షి పెళ్లికి సంబంధించిన ఏ విషయమైనా తామే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపింది.

అందుకే ఇకనైనా పెళ్లి పుకార్లకు ఫుల్‌ స్టాప్ పెట్టాలని కోరింది మీనాక్షి టీమ్. అయితే ఇంతకు ముందు ఇలాంటి ప్రచారం జరగ్గా.. మీనాక్షినే స్వయంగా రెస్పాండ్ అయ్యారు. అవన్నీ పుకార్లు మాత్రమేనని తెలిపారు. ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. అయినా మళ్లీ రూమర్స్ వస్తుండడంతో ఆమె టీమ్ ఇప్పుడు నెట్టింట వివరణ ఇచ్చింది.

అయితే మీనాక్షి విషయానికొస్తే.. తక్కువ టైమ్ లోనే ఆమె ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో ఒకరు. ఇప్పుడు అనగనగా ఒక రాజు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో అక్కినేని నాగచైతన్య సరసన వృష కర్మ చిత్రంలో నటిస్తున్నారు. మరిన్ని సినిమాలు లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇలాంటి టైమ్ లో అనవసర ప్రచారం చేయడం అస్సలు మంచిది కాదని అనేక మంది సినీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News