చిన్ననాటి ఫోటోల్లో మ‌రింత క్యూట్ గా మీనాక్షి

ఇదిలా ఉంటే మీనాక్షి సోష‌ల్ మీడియాలో త‌న బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటూ కొన్ని ఫోటోల‌ను షేర్ చేసింది.;

Update: 2025-04-21 09:46 GMT

అన అందం, అభిన‌యంతో అంద‌రి మ‌న‌సుల్ని గెలుచుకుంటున్న హ‌ర్యానా భామ మీనాక్షి చౌద‌రి, ఈ ఏడాది ఆల్రెడీ సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చి ఆ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ను అందుకుంది. ప్ర‌స్తుతం మీనాక్షి ప‌లు సినిమాలు, షాప్ ఓపెనింగ్స్ అంటూ క్ష‌ణం తీరిక లేకుండా చాలా బిజీ బిజీగా లైఫ్ లో ముందుకెళ్తుంది.


ఇదిలా ఉంటే మీనాక్షి సోష‌ల్ మీడియాలో త‌న బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటూ కొన్ని ఫోటోల‌ను షేర్ చేసింది. మీనాక్షి త‌న త‌ల్లి బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆ స్పెష‌ల్ పోస్ట్ ను చేసింది. ఆ పోస్ట్ లో మీనాక్షి చిన్న‌నాటి ఫోటోల నుంచి ప్ర‌స్తుతం వ‌ర‌కు అన్ని ఫోటోలు ఉన్నాయి. మీనాక్షి చిన్న‌నాటి ఫోటోల్లో ఎంతో క్యూట్ గా ఉందంటూ నెటిజ‌న్లు ఆ ఫోటోల‌కు కామెంట్స్ చేస్తున్నారు.


త‌న త‌ల్లికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్తూ మీనాక్షి ఆ పోస్ట్ చేసింది. ఫ్యామిలీ మొత్తానికి ప్రేమ పంచుతూ, త‌న‌కు ఇంత అంద‌మైన జీవితాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ మీనాక్షి త‌ల్లికి బ‌ర్త్ డే విషెస్ తెలిపింది. మీనాక్షి పోస్ట్ కు ఎంతోమంది రిప్లైలు ఇస్తూ త‌న త‌ల్లికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఆ పోస్ట్ కు లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు.


ఇక కెరీర్ విష‌యానికొస్తే మీనాక్షి ప్ర‌స్తుతం అక్కినేని నాగ‌చైత‌న్యతో క‌లిసి ఓ సినిమా చేస్తుంది. ఈ సినిమాకు విరూపాక్ష డైరెక్ట‌ర్ కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మ‌రికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు కూడా మీనాక్షి ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నాయి. కానీ ఇంకా ఏవీ అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు.

Tags:    

Similar News