చికాగోలో మీనూ అందాలు.. లైట్ వెలుతురులో జిగేల్ మంటూ!

అక్కడి అందాలను ఆస్వాదిస్తూ.. విదేశీ వీధుల్లో చక్కర్లు కొడుతూ.. రాత్రుల్లో లైట్ వెలుతురులో జిగేలుమంటూ నెటిజన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

Update: 2026-07-27 05:27 GMT

అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న మీనాక్షి చౌదరి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. వరుస సినిమాలతో అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. తాజాగా వెకేషన్ లో భాగంగా చికాగో కి వెళ్ళింది. అక్కడి అందాలను ఆస్వాదిస్తూ.. విదేశీ వీధుల్లో చక్కర్లు కొడుతూ.. రాత్రుల్లో లైట్ వెలుతురులో జిగేలుమంటూ నెటిజన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.



 


విదేశీ వీధుల్లో మీనూ గ్లామర్ టచ్..

వెకేషన్ లో భాగంగా చికాగోకి వెళ్ళిన మీనాక్షి చౌదరి వైట్ టీ షర్టు, బ్లాక్ షార్ట్ ధరించి కళ్లకు గ్లాసెస్ , తలపై క్యాప్ పెట్టుకొని తన అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా అక్కడి అందాలను ఆడియన్స్ తో పంచుకుంటూ చికాగో పరిసర ప్రాంతాలను పరిచయం చేసింది. మరికొన్ని ఫోటోలలో ఆమె గడిపిన రిసార్ట్ ఫోటోలను షేర్ చేస్తూనే ఇంకొన్ని ఫోటోలలో తన స్నేహితులతో కలిసి ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేడుకగా పంచుకుంది.

గమ్యంలోనే కాదు జర్నీలో కూడా..

మీనాక్షి చౌదరి ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ ఫోటోలను షేర్ చేస్తూ గమ్యంలోనే కాకుండా ప్రయాణంలో కూడా ఆనందాన్ని వెతుక్కునే ప్రయత్నం చేయాలని గుర్తుంచుకోండి అంటూ తన అభిప్రాయాలను పంచుకుంది. అంతేకాదు ఈ ఫోటోలకు క్యాప్షన్ గా ఒక్క నిమిషం చికాగో అంటూ తన అభిప్రాయాలను పంచుకుంది. మొత్తానికైతే మీనాక్షి చౌదరి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అమ్మడి అందానికి చికాగో పరిసర ప్రాంతాలకు ఫిదా అవుతూ తమ అభిప్రాయాలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంటున్నారు.



 


మోడల్ నుండి సినీనటిగా ప్రయాణం..

మోడల్గా తన కెరీర్ ను ప్రారంభించిన మీనాక్షి చౌదరి 2018లో ఫెమినా మిస్ ఇండియా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్ గా నిలిచి.. రెడ్ కార్పెట్ పై ర్యాంప్ వాక్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇక అలా మోడల్ గా అందరి దృష్టిని ఆకట్టుకున్న మీనాక్షి చౌదరికి ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాలో హీరోయిన్గా అవకాశం లభించింది. అక్కినేని సుశాంత్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో హీరోయిన్గా నటించి తన అందంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది మీనాక్షి చౌదరి.



 


మీనాక్షి చౌదరి సినిమాలు..

ఖిలాడి సినిమాతో రవితేజ సరసన నటించి మంచి పేరు సొంతం చేసుకున్న మీనాక్షి చౌదరి.. హిట్ 2 సినిమాతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. గుంటూరు కారం లక్కీ భాస్కర్ , మట్కా, మెకానిక్ రాకీ వంటి చిత్రాలతో వరుసగా విజయాలు అందుకున్న ఈమె.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. అనగనగా ఒక రాజు సినిమాతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒకవైపు తన వరుస ప్రాజెక్టులలో నటిస్తూనే.. మరొకవైపు ఇలా కాస్త విరామం దొరికితే వెకేషన్ కి వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తోంది.



 


Tags:    

Similar News