అవ‌న్నీ చూసి అస‌హ్యమేసింది

2022లో త‌న భర్త అనారోగ్యంతో చ‌నిపోయాక సోష‌ల్ మీడియాలో త‌నపై వ‌చ్చిన రూమ‌ర్ల గురించి మాట్లాడుతూ మీనా అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.;

Update: 2025-09-15 20:30 GMT

చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ను స్టార్ట్ చేసి త‌ర్వాత హీరోయిన్ గా మారి ఎన్నో సినిమాలు చేసిన మీనా తాజాగా జ‌గ‌ప‌తిబాబు హోస్ట్ చేస్తున్న జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా టాక్ షో కు వ‌చ్చి అందులో త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను, కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకున్నారు. ప్రొడ్యూసర్లు చాలా మంది ఫ్లాపుల్లో ఉన్నామ‌ని, త‌క్కువ బ‌డ్జెట్ తో సినిమాలు చేస్తున్నామ‌ని చెప్ప‌డంతో చాలా త‌క్కువ మొత్తానికే ఆ సినిమాలు చేశానని, అలా చేసిన సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యేవ‌ని, సినిమాలు హిట్ట‌య్యాక నిర్మాత‌లు త‌న‌ను మ‌ర్చిపోయేవార‌ని, ఇలా త‌న కెరీర్లో చాలా సార్లు జ‌రిగింద‌ని ఆమె చెప్పారు.

జ‌గ‌ప‌తిబాబు ఎప్పుడూ పోటీనే!

కెరీర్ పీక్స్ లో ఉన్న‌ప్పుడే విద్యా సాగ‌ర్ ను పెళ్లి చేసుకున్నాన‌ని, పాప పుట్టిన రెండేళ్ల‌కు మ‌ల‌యాళం మూవీ దృశ్యం లో ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని, పాప‌ను వ‌దిలి వెళ్లడం ఇష్టం లేక దాన్ని రిజెక్ట్ చేశాన‌ని, కానీ త‌న‌ను దృష్టిలో పెట్టుకునే క‌థ‌ను రాసిన‌ట్టు చెప్ప‌డంతో ఆ సినిమాను చేశాన‌ని చెప్పిన మీనా, జ‌గ‌ప‌తి బాబు త‌న‌కెప్పుడూ పోటీనే అని, అత‌ని ప‌క్క‌న యాక్ట్ చేస్తుంటే త‌న‌కంటే ఎక్కువగా జ‌గ‌పతిబాబునే చూసేవార‌ని చెప్పి స‌ర‌దాగా వ్యాఖ్యానించారు మీనా.

ఎవ‌రు విడాకులు తీసుకున్నా మీనాతో పెళ్లి అని వార్త‌లు

2022లో త‌న భర్త అనారోగ్యంతో చ‌నిపోయాక సోష‌ల్ మీడియాలో త‌నపై వ‌చ్చిన రూమ‌ర్ల గురించి మాట్లాడుతూ మీనా అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. భ‌ర్త చ‌నిపోయిన త‌ర్వాత వారానికే మీనా మ‌ళ్లీ పెళ్లి చేసుకోబోతుంద‌ని వార్త‌లు రాశార‌ని, అవి చూసి వాళ్ల‌కు కుటుంబాలుండ‌వా? మ‌న‌సుండ‌దా అనిపించేద‌ని, ఆ త‌ర్వాత ఎవ‌రు విడాకులు తీసుకున్నా మీనాతో పెళ్లి అని రాసేవార‌ని, అలాంటివ‌న్నీ చూసి అస‌హ్యం వేసింద‌ని, భ‌ర్త చ‌నిపోయిన బాధ నుంచి తాను రెండేళ్ల వ‌ర‌కు కోలుకోలేక‌పోయాని, ఆ టైమ్ లో ఫ్రెండ్సే త‌న‌కు స‌పోర్ట్ గా ఉన్నార‌ని మీనా పేర్కొన్నారు.

ఆ రోజు సౌంద‌ర్య‌తో నేనూ వెళ్లాల్సింది

హీరోయిన్ మీనా త‌న‌కు చాలా మంచి ఫ్రెండ్ అని, ఎల‌క్ష‌న్ క్యాంపైన్ కు వెళ్లి హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో చ‌నిపోవ‌డం చాలా దారుణ‌మ‌ని, వాస్త‌వానికి ఆ క్యాంపైన్ కు తాను కూడా వెళ్లాల్సింద‌ని, కానీ షూటింగ్స్ లో బిజీగా ఉండ‌టం వ‌ల్ల తాను వెళ్ల‌లేక‌పోయాన‌ని, పైగా త‌న‌కు ఎల‌క్ష‌న్స్ క్యాంపైన్ అంటే పెద్ద‌గా ఇంట్రెస్ట్ లేక‌పోవ‌డంతో వెళ్ల‌లేద‌ని, కానీ సౌంద‌ర్య‌ను అలా కోల్పోవ‌డం చాలా బాధ‌ను క‌లిగించింద‌ని ఎమోష‌న‌ల్ అయ్యారు మీనా.

Tags:    

Similar News